ఆ డబ్బు పునిత్ లక్ష్యం కోసం వాడతా : విశాల్

కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో కర్ణాటక రాష్ట్రం అంతా కన్నీటి పర్వంతం అయ్యింది. పునీత్ అకాల మరణంతో కుటుంబ సభ్యులతో పాటు అభిమానులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. పునీత్ రాజ్ కుమార్ రీల్ హీరోనే కాదు.. రియల్ హీరోగా ఎన్నో మంచి పనులు చేపట్టారు.

fasdga compressedపునీత్ తన స్వఛ్చంద సంస్థ ద్వార ఎంతో మందికి సాయం చేస్తున్నారు. అందులో ప్రదానంగా అనాధాశ్రమాలు, వృధ్దాశ్రమాలు నడుపుతున్నారు. మరీ ముఖ్యంగా నిరుపేద విధ్యార్ధులకు చదువు చెప్పిస్తున్నారు. సుమారు 1800 మందికి పునీత్ రాజ్ కుమార్ తన సొంత ఖర్చులతో విద్యాదానం చేస్తున్నారు. కర్ణాటక ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన పునీత్‌ సంస్మరణ సభలో దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు పాల్గొన్నారు.

పునీత్‌తో తమకున్న అనుబంధాన్ని నెమరువేసుకొని.. ఆయన చేసిన మంచి పనులను గుర్తు చేసుకున్నారు. ఇందులో భాగంగా నటుడు విశాల్‌ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. తాను ఇండస్ట్రీకి వచ్చిన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 16 సంవత్సరాలైనప్పటికీ తనకు సొంత ఇల్లు లేదని నటుడు విశాల్‌ అన్నారు. మా తల్లిదండ్రుల ఇంటిలోనే ఉంటున్నాను. నా సొంతింటి కలను నెరవేర్చుకోవడం కోసం ఇప్పటివరకూ డబ్బు కూడబెట్టుకున్నాను. ఆ డబ్బునే ఇప్పుడు పిల్లల చదువు కోసం ఖర్చు చేస్తాను. పునీత్‌ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని విశాల్‌ అన్నారు.