బిగ్ బ్రేకింగ్: హీరో రామ్ కు గాయాలు

hero ram injuired

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని తనే స్వయంగా తన సోషల్ మీడియాలో ఖాతాలో మేడకు గాయమైన ఫోటో ను పోస్ట్ చేశాడు. అయితే రామ్ హీరోగా డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది ఉప్పెన చిత్రం హీరోయిన్ కృతిశెట్టి. ఇక ఈ సినిమాలో పాత్ర డిమండ్ చేయటంతో రామ్ బాడీ బిల్డింగ్ చేస్తున్నాడు.

తాజాగా ఈ క్రమంలో రామ్ జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా మెడకు గాయం అయింది. దీంతో.. రామ్ ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కు కాస్త బ్రేక్ ఇచ్చాడు. కాగ.. మొన్నటికి మొన్న సాయిధరమ్ తేజ్ ఆక్సిడెంట్ తో సినీ ఇండస్ట్రీ అంతా ఉలిక్కిపడింది. ఇప్పుడిప్పుడే తేజ్ ఆ ఘటన నుండి కోలుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా రామ్ కి ప్రమాదం జరగటంతో ఫ్యాన్స్ అంతా షాక్ లో ఉండిపోయారు. అయితే రామ్ కి అయిన గాయం తీవ్రత ద్రుష్ట్యా కాస్త చిన్నదే అయినా.. ముందు జాగ్రత్తగా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి.. రామ్ ఈ ప్రమాదం నుండి త్వరగా కోలుకోవాలని మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలిజేయండి.