ఓ ఇంటివాడైన నటుడు కార్తికేయ.. హాజరైన చిరంజీవి

Karthikeya Wedding

తెలుగు చిత్ర పరిశ్రమలో ఆర్ ఎక్స్ 100 సినిమాతో మాస్ హిట్ ను అందుకున్నాడు హీరో కార్తికేయ. ఈ మూవీతో హీరోగా అందరికి పరిచయమైన యంగ్ హీరో బ్యాచ్ లర్ జీవితానికి గుడ్ బై చెప్పి ఈ రోజు ఓ ఇంటివాడయ్యాడు. ఆదివారం హైదరాబాద్ లో ఓ ఫంక్షన్ హాలులో తన కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా వివాహం చేసుకున్నాడు. ఇక ఇన్నాళ్లకి హీరో కార్తికేయ సైతం ముచ్చటగా వధువు లోహితా రెడ్డికి మూడు ముళ్లు వేసుకుని ఘనంగా వివాహం చేసుకున్నాడు. ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవితో పాటు అజయ్ భూపతి, తనికెళ్లభరణి, పాయల్ రాజ్ పుత్ తో పాటు పలువురు సినీ నటులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇక తాజాగా కార్తికేయ పెళ్లి ఫోటోలు నెట్టింల్లో కాస్త వైరల్ గా మారాయి.