‘శుభలేఖ సుధాకర్‌’కు మాతృవియోగం

subhalekha sudhakar

ప్రముఖ నటుడు శుభలేఖ సుధాకర్‌ మాతృమూర్తి మంగళవారం చెన్నెలో కన్నుమూశారు. శుభలేఖ సుధాకర్‌ తల్లి, ప్రముఖ నేపథ్య గాయని ఎస్పీ శైలజ అత్తగారు ఎస్‌ఎస్‌ కాంతం(82) గుండెపోటుతో మృతి చెందారు. ఆమె చెన్నై మహాలింగపురంలోని సుధాకర్‌ నివాసంలో ఉండేవారు. సుధాకర్‌ తండ్రి సూరావజ్జల కృష్ణారావు రెండేళ్ల క్రితమే మరణించారు.

తల్లి కాంతం సుమారు మూడు నెలల క్రితం గుండెపోటుకు గురయ్యారు. వృద్ధాప్య, అనారోగ్య కారణాలతో మంగళవారం ఉదయం కాంతం మృతి చెందారు. కృష్ణారావు, కాంతం దంపతులకు ముగ్గురు కుమారులు. వారిలో శుభలేఖ సుధాకర్‌ పెద్దవారు. బుధవారం మధ్యాహ్నం చెన్నైలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.