ఆకట్టుకుంటున్న లెఫ్టినెంట్ రామ్ గ్లిమ్ప్స్

Dulquer Salman Lieutenant Ram movie Latest Glimpses - Suman TV

టాలీవుడ్ మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించారు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్. ఈ సినిమాతో దక్షిణాది వ్యాప్తంగా మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇక ఈ చిత్రం తర్వాత ఆయన అనేక సినిమాల్లో నటించారు. మలయాళ ప్రముఖ నటుడైన మమ్ముట్టి కొడుకే ఈ సల్మాన్. సెకండ్ షో అనే మలయాళ చిత్రంతో ఆయన తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత అన్వర్ రషీద్ డైరక్షన్ లో రెండవ సినిమా ఉస్తాద్ హోటల్ అనే సినిమాల్లో నటించి మెప్పించారు. ఈ సినిమా జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమాగా గుర్తింపును పొందింది.

Dulquer Salman New Movie Glimpse 01 minఇక ప్రస్తుతం తెలుగులో హను రాఘవపూడి దర్శకత్వంలో లెఫ్టినెంట్ రామ్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు సల్మాన్. ఈ మూవీని వైజయంతి మూవీస్ పతాకంపై స్వప్న నిర్మిస్తున్నారు. ఇక విషయం ఏంటంటే.. నేడు దుల్కర్ సల్మాన్ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లిమ్ప్స్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఇక ఇందులో మంచు కొండల నుంచి ఆర్మీ దుస్తుల్లో సల్మాన్ మనడుచుకుంటూ వస్తుండటంతో ఆయన ఫాన్స్ తెగ సంబర పడుతున్నారు. తాజాగా విడుదల చేసిన ఈ మూవీ గ్లిమ్ప్స్ నెట్టింట్లో వైరల్ గా మారింది.