టాలీవుడ్ మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించారు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్. ఈ సినిమాతో దక్షిణాది వ్యాప్తంగా మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇక ఈ చిత్రం తర్వాత ఆయన అనేక సినిమాల్లో నటించారు. మలయాళ ప్రముఖ నటుడైన మమ్ముట్టి కొడుకే ఈ సల్మాన్. సెకండ్ షో అనే మలయాళ చిత్రంతో ఆయన తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత అన్వర్ రషీద్ డైరక్షన్ లో రెండవ సినిమా ఉస్తాద్ హోటల్ అనే సినిమాల్లో నటించి మెప్పించారు. […]