ధనుష్ టాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్! ఇక రచ్చే!

కోలీవుడ్ హీరోలు టాలీవుడ్ టర్న్ తీసుకుంటున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే అరవ హీరోలలో కొంతమంది సీనియర్స్ టాలీవుడ్ లో టాప్ లేపారు. ఇప్పుడు కుర్ర హీరోలు కూడా మన మార్కెట్ ను క్యాష్ చేసుకునేందుకు ట్రై చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో మరో కోలివుడ్ స్టార్ ధనుష్ చేరడం తెలుగునాట హాట్ టాపిక్గా మారింది. గతంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ మద్రాస్ వేదికగా ఉండటంతో.. అప్పట్లో మూవీ మేకర్స్ తమిళ హీరోలతో కూడా తెలుగులో సినిమాలు చేశారు. అలా రజనీకాంత్, కమల్ హాసన్ ఇప్పటికీ తెలుగు హీరోలతో సమానంగా పేరు సంపాదించుకోవడమే కాదు.. కోలివుడ్తో పాటు టాలీవుడ్లోనూ తమ సినమాలను రిలీజ్ చేశారు. అయితే కుర్రహీరోలకు మాత్రం ఆ చాన్స్ లేకుండా పోయింది. దీంతో ఇప్పటిదాకా డబ్బింగ్ సినిమాలతోనే మాగ్జిమమ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే.., వీరిలో అతికొద్ది మాత్రం టాలీవుడ్ వైపు అడుగులు వేస్తూ తెలుగువారికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అలా కార్తి, విజయ్ సేతుపతి.. నేరుగా తెలుగులో మూవీస్ చేశారు. దీంతో వీరి బాటలో.. మిగతా కుర్ర హీరోలు కూడా టాలీవుడ్ పై కన్నేస్తున్నారు. తెలుగులో స్ట్రేయిట్ మూవీ చేసేందుకు ఇప్పటికే హీరో విజయ్ ఒకే చెప్పాడని అంతా అనుకుంటున్నారు. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ఈ మూవీకి వంశీ పైడిపల్లి దర్శకుడిగా అనుకున్నారు. అయితే మరో స్టార్ హీరో ఈ క్యూలోకి వచ్చాడు.

dhanush 2రజనీకాంత్ అల్లుడు, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కూడా తెలుగులో స్ట్రేయిట్ మూవీ చేయాలని.. చాలాకాలం నుంచి అనుకుంటున్నాడు. కనీసం మల్టీస్టారర్ మూవీలో అయినా నటించాలని ట్రై చేస్తున్నాడు. గతంలోనే నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు అవకాశం వచ్చినా.., అనుకోని కారణాలతో ఆ ప్రాజెక్ట్ మాత్రం సెట్స్ పైకి రాలేదు. అయితే ఇన్నాళ్లకు మరోసారి తెలుగు లాంగ్వేజ్ లో మూవీ చేసేందుకు సిద్ధమవుతున్నాడట ఈ వర్సటైల్ స్టార్. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ.. మల్టీ లాంగ్వేజెస్ లో తీయనున్న చిత్రంలో.. ధనుష్ ఓ కథానాయకుడిగా చేయబోతున్నట్లు చెబుతున్నారు. రఘువరన్ బీటెక్ మూవీతో.. ఇక్కడి యూత్ నుంచి క్రేజ్ సంపాదించుకున్న ధనుష్.. యాక్టింగే కాకుండా.. రచయిత, నిర్మాత, దర్శకుడిగా.. ఇలా మల్టీ ట్యాలెంటెడ్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇన్నాళ్లూ తమిళ మూవీస్ కే పరిమితమైన ధనుష్.. ఆ మధ్య హిందీలో కూడా ఓ సినిమా చేశాడు. ఆ తర్వాత హాలీవుడ్ లో కూడా ఓ మూవీలో నటించిన ధనుష్.. ప్రస్తుతం ఓ అమెరికన్ మూవీ చేస్తున్నాడు. అయితే బాలీవుడ్ తర్వాత అంత మార్కెట్ ఉన్న తెలుగులో సినిమా చేయకపోవడం ఏమిటన్న ఆలోచన వచ్చిందట ధనుష్కి. దీంతో త్వరలోనే ఇక్కడా జెండా ఎగరేయాలని అనుకుంటున్నాడట. చూడాలి మరి ధనుష్ తెలుగునాట ఎంతవరకు సక్సెస్ అవుతాడో. మరి.., హీరో వర్షిప్ ఎక్కువగా ఉండే టాలీవుడ్ లో ధనుష్ సక్సెస్ కాగలడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.