ధనుష్‌ను ప్యాన్ వరల్డ్ స్టార్‌గా మార్చేసింది. ఆయన త్వరలో గ్రే మ్యాన్ సీక్వెల్‌లో కూడా నటించనున్నారు. ఇక, అసలు విషయానికి వస్తే.. ధనుష్‌కు సంబంధించిన....
ధనుష్.. ప్యాన్ వరల్డ్ స్టార్‌గా ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది. ఆయన తన విలక్షణమైన నటనతో ఇండస్ట్రీల హద్దుల్ని ఎప్పుడో చెరిపేశారు. తమిళ స్టార్ హీరో అయినప్పటికీ.. దేశ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. ‘సార్’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి కూడా అడుగుపెట్టారు. ‘సార్’ సినిమా తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కలెక్షన్ల వర్షం కురిపించింది. ధనుష్ కేవలం తమిళం, తెలుగులోనే కాదు.. హిందీ, ఇంగ్లీష్ భాషల్లోనూ సినిమాలు చేస్తున్నారు. ఆయన నటించిన ‘ గ్రే మ్యాన్’ అనే ఆంగ్ల సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.
ధనుష్‌ను ప్యాన్ వరల్డ్ స్టార్‌గా మార్చేసింది. ఆయన త్వరలో గ్రే మ్యాన్ సీక్వెల్‌లో కూడా నటించనున్నారు. ఇక, అసలు విషయానికి వస్తే.. ధనుష్‌కు సంబంధించిన న్యూ లుక్ ఫొటోలు, వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆయన న్యూ లుక్ చాలా వెరైటీగా ఉంది. ధనుష్ జుట్టు, గడ్డం బాగా పెంచేశారు. ముఖం మొత్తం వాటి మధ్య కనిపించీ, కనిపించకుండా ఉంది. దానికి తోడు ఆయన నల్లటి కంటి అద్దాలు పెట్టుకుని ఉన్నారు. దీంతో ఆయన్ని వెంటనే గుర్తు పట్టడం కొంచెం కష్టంగా తయారైంది. ఈ న్యూ లుక్ సినిమా కోసమా?
లేక ఆధ్యాత్మిక చింతన కోసమా? అన్నది తెలియరాలేదు. కాగా, ధనుష్ ప్రస్తుతం ‘కెప్టెన్ మిల్లర్’ అనే సినిమాలో నటించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి నటీ,నటుల పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. కొన్ని ప్రధాన పాత్రలకు సంబంధించిన వివరాలను మాత్రమే సినిమా బృందం విడుదల చేసింది. కెప్టెన్ మిల్లర్ సినిమాలో సందీప్ కిషన్ కూడా మెయిన్‌రోల్ చేయబోతున్నారు. మరి, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ధనుష్ న్యూ లుక్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.