అతడ్ని ‘అన్నా’ అని పిలవలేను అంటున్న ‘ప్రియాంక సింగ్‌’

priyanka singh

‘బిగ్‌ బాస్‌’ సీజన్‌-5లో ఫస్ట్‌ నామినేషన్స్‌తో ఆటకి మసాలా యాడ్‌ అయ్యింది. తాజా ప్రోమోలో హౌస్‌ మేట్స్‌ చేసిన రచ్చ మాములుగా లేదు. ఈ సీజన్‌కు ప్రత్యేకంగా పరియచం చేసిన ‘పవర్‌ రూమ్‌’ కాన్సెప్ట్‌ చాలా ఇంట్రస్టింగ్‌గా ఉండబోతోంది. పవర్‌ రూమ్ ఛాన్స్‌ కొట్టేసిన విశ్వ ‘యాంకర్‌ రవి’, నటి ప్రియను ఎంచుకుంటాడు. ఇక, అప్పుడు లేడీ డ్రస్సులో రవి పడిన హొయలు అంతా ఇంతా కాదు. ఈ ప్రోమోలోనే మరో ఇంట్రస్టింగ్‌ విషయం జరిగింది. జబర్దస్త్‌ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన ‘ప్రియాంక సింగ్‌’ బిగ్‌బాస్‌ హౌస్‌లో తప్పకుండా సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌ అనే చెప్పాలి. రవి అడిగిన ప్రశ్నకు ప్రియాంక సింగ్‌ ఇచ్చిన ఆన్సర్‌ ఇప్పుడు హౌస్‌లో కొత్త ఇష్టాలకు తావిస్తుందేమో అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి.

priyanka singhవిషయం ఏంటంటే బెడ్‌ రూమ్‌లో అందరూ ఉన్నప్పుడు డిస్కషన్‌లో రవి ప్రియాంక సింగ్‌ని.. ‘నన్ను ఏమని పిలుస్తావు అని అడుగగా’.. అన్న అని టక్కున బదులిస్తుంది. మరి విశ్వని ఏమని పిలుస్తావు? అనగానే వెంటనే అన్నయ్య అని సమాధానం చెబుతుంది. పక్కనున్న మానస్‌ని చూపించి మరి అతడ్ని ఏమని పిలుస్తావు అనగానే.. అట్లేం పిలవను అంటుంది. అంతే ఒక్కసారిగా అందరూ కేకలేస్తూ మానస్‌ను ఆటపట్టిస్తారు. ఈ వ్యవహారం చూస్తుంటే బిగ్‌బాస్‌ హౌస్‌లో బుల్లితెర ప్రేమాయణం ప్రారంభమౌతుందేమో అని టాక్‌ షురూ అయిపోయింది.

ఈ వారం బిగ్‌బాస్‌ హౌస్‌ నామినేషన్‌లో జెస్సీ, మానస్‌, సరయు, ఆర్జే కాజల్‌, యాంకర్‌ రవి, హమీదా ఉన్న విషయం తెలిసిందే.