ఆసక్తిగా మా ఎన్నికలు.. నా ఓటు వాళ్లకే వేశాను – బాలకృష్ణ

maa elections balakrishna

గత రెండు మూడు నెలల నుంచి రసవత్తరంగా సాగుతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేష్ ఎన్నికల ఓటింగ్ నేడు కాస్త ఆసక్తిగా చిత్ర విచిత్రల నడుమ సాగుతోంది. జూబ్లిహిల్స్ లోని ఎన్నికల కేంద్రానికి చేరుకున్న నటీనటులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఓటింగ్ లో భాగంగా పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, చిరంజీవి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అయితే ఎన్నికల ఓటింగ్ లో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు నందమూరి బాలకృష్ణ. మా అధ్యక్షుల పోటీలో ఉన్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ఇండస్ట్రీకి అన్నదమ్ముల్లాంటి వాళ్లే అని అన్నారు. సినిమా ఇండస్ట్రీకి ఎవరైతే అభివృద్ధి చేయగలరో వారికి నా ఓటు వేశానన్నారు. కానీ ఇద్దరి ఊపు చూస్తుంటే బాగానే చేసే విధంగా కనిపిస్తున్నారని తెలిపారు. మా ఎన్నికల నేపథ్యంలో మాత్రమే ఇలా గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. ఎన్నికల అనంతరం అందరం కలిసి మళ్లీ సినిమా షూటింగ్ లో పాల్గొంటామంటూ తెలిపారు. ఇక దీంతో పాటు గెలిచిన వ్యక్తులు మాటలు చెప్పటమే కాదు, చేతల్లో చేసి చూపించాలని తెలిపారు బాలకృష్ణ.