మనసుకు హత్తుకునేలా భార్యకి బర్త్‌ డే విషెస్‌ చెప్పిన అల్లు అర్జున్‌!

తెలుగు ఇండస్ట్రీలో ‘గంగోత్రి’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగా హీరో అల్లు అర్జున్.. తర్వాత వరుస విజయాలతో దూసుకు వెళ్లారు. సుకుమార్ తెరకెక్కించిన ఆర్య చిత్రంతో స్టైలిష్ స్టార్ గా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో స్నేహారెడ్డి ప్రేమించి పెద్దలను ఒప్పించి మార్చి 6, 2011న వివాహం చేసుకున్నాడు. వీరికి ​కొడుకు అయాన్, కూతురు ఆర్హా పుట్టారు.

allu arjun minఇండస్ట్రీలో అల్లు అర్జున్ ఫ్యామిలీ ప‌ర్స‌న్ అనే సంగతి మ‌నంద‌రికి తెలిసిందే. సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీ మెంబర్స్ తో విలువైన స‌మయం గడుపుతుంటాడు. ఈ రోజు (సెప్టెంబర్‌ 29న) త‌న శ్రీమ‌తి స్నేహ పుట్టిన రోజు కావ‌డంతో సోష‌ల్ మీడియాలో ఇద్ద‌రు క‌లిసి దిగిన ఫొటోని షేర్ చేస్తూ.. ‘నా జీవితంలో అత్యంత ప్రత్యేకమైన వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీలాంటి ఒకరు నా లైఫ్‌లో ఉండడం నా అదృష్టం. మరెన్నో జన్మదినాలు నీతో గడపాలని కోరుకుంటున్నాను. హ్యాపి బర్త్‌ డే క్యూటీ’ అంటూ బ‌న్నీ త‌న పోస్ట్‌లో పేర్కొన్నాడు.

bannie3 minఈ సందర్భంగా ఎంతో మంది సినీ ప్రముఖులు, అల్లు అభిమానుల నుంచి ఆమెకి సోషల్‌ మీడియా వేదికగా విషెస్‌ వెల్లువెత్తాయి. ట్విట్టర్‌లో #allusnehareddy ట్యాగ్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. సుకుమార్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌ ‘పుష్ప’లో నటిస్తున్నాడు. రెండు పార్టులుగా రానున్న ఈ సినిమాలో మొదటి భాగం డిసెంబర్‌ విడుదల కానుంది. అనంతరం వేణు శ్రీ రామ్‌ దర్శకుడిగా ‘ఐకాన్‌’ మూవీ చేయనున్నాడు.