RRR, KGF సినిమాలపై అభిషేక్ బచ్చన్‌ దురుసు వ్యాఖ్యలు!

Abhishek bachan comments on RRR and KGF movies

ప్రస్తుతం దేశవ్యాప్తంగా దక్షిణాది సినిమాల హవా నడుస్తోందని అందరికీ తెలిసిందే. బాహుబలి తో మొదలైన ఈ క్రేజ్‌.. నిన్నమొన్నటి పుష్ప, ట్రిపులార్‌, కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2 వరకు కొనసాగుతూనే ఉంది. తెలుగు, కన్నడ సినిమాలకు బాలీవుడ్‌ ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. స్ట్రైట్‌ హిందీ సినిమాలు కూడా సాధించలేని రికార్డులు ఇప్పుడు దక్షిణాది సినిమాలు చేసి చూపిస్తున్నాయి. సౌత్‌ సినిమాలుక లేకపోతే కరోనా సమయంలో మేమంతా అడుక్కోవాల్సి వచ్చేదని హిందీ డిస్ట్రిబ్యూటర్లు చెప్పిన మాటలు కూడా విన్నాం. ప్రేక్షకులు సైతం ఇండస్ట్రీతో సంబంధం లేకుండా విషయం ఉన్న సినిమాలను నెత్తిన పెట్టుకుంటున్నారు. కానీ, బీ టౌన్‌ పెద్దల తీరు మరోలా ఉంది. అవకాశం దొరికినప్పుడల్లా అక్కసు వెళ్లగక్కుతున్నారు.

ఇదీ చదవండి: భార్యతో కలిసి వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తున్న రాకింగ్‌ స్టార్ యశ్‌! ఫొటోస్ వైరల్‌

ఒకవైపు దక్షిణాది నుంచి వస్తున్న పాన్ ఇండియా సినిమాలను పొగుడుతూనే సమయం, సందర్భం చూసి వారి కడుప మంటను ప్రదర్శిస్తున్నారు. తెలుగు లాంటి రీజనల్‌ సినిమాల్లో నేను నటించను అని జాన్‌ అబ్రహం కామెంట్‌ చేసి ఎంత అభాసు పాలు అయ్యాడో చూశాం. అందుకు మహేశ్‌ బాబు, రాకింగ్‌ స్టార్‌ యశ్‌ వంటి వారు మేము హిందీ సినిమాల్లో నటించాల్సిన అవసరం ఏముంది? అని బాహాటంగానే ప్రశ్నించడం చూశాం. RRR సినిమాతో రొమ్ము విరిచి ఇది తెలుగు సినిమా అని చెప్పుకునే స్థాయికి రాజమౌళి తీసుకెళ్లారు.. అని ఆచార్య ప్రీ రిలీజ్‌ ఈవెంట్లో చిరంజీవి ఎమోషనల్‌ అవ్వడం చూస్తూనే తెలుస్తుంది.. బాలీవుడ్‌ ఇండస్ట్రీ తీరు ఏవిధంగా ఉండేదో. ఇప్పుడు అలాంటి అవసరపు కామెంట్స్‌ చేసే జాబితాలోకి అభిషేక్‌ బచ్చన్‌ చేరిపోయాడు.

Abhishek bachan comments on RRR and KGF movies

బాలీవుడ్‌ ఇండస్ట్రీకి కురు వృద్ధుడి స్థానంలో అమితాబ్‌ బచ్చన్‌ ఎంత అణుకువగా ఉంటారో అందరికీ తెలుసు. అన్ని ఇండస్ట్రీల టాప్‌ హీరోలతో అమితాబ్‌ బచ్చన్‌ కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడూ ఒక సినిమాని, ఒక హీరోని కించపరిచేలా ఆయన కామెంట్‌ చేసింది లేదు. కానీ, అభిషేక్ బచ్చన్ ఎందుకు సౌత్‌ సినిమాలపై తన అక్కసు వెళ్లగక్కారో అర్థం కాలేదు. సౌత్‌ సినిమాలు బాలీవుడ్‌లో రీమేక్ కావడంపై స్పందించాడు. ‘ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ ఎంతో పెద్దది. విభిన్న భాషలు, సంస్కృతులతో కలిసి ఉంటుంది. భారతీయ సినిమా రంగంలో నిర్మించబడిన సినిమాలు ఎప్పుడైనా, ఎక్కడైనా రిమేక్‌ అవుతుంటాయి. అలా అనుకుంటే బాలీవుడ్‌ సినిమాలను కూడా రీమేక్ చేస్తుంటారు. ఒక సినిమాని రీమేక్ చేయడం అంటే ఆలోచనలను పంచుకోవడం. 70 ఏళ్లుగా సౌత్‌ సినిమాలు హిందీలో, ఇక్కడి సినిమాలు వివిధ భాషల్లో రీమేక్ అవుతూనే ఉన్నాయి.’

ఇదీ చదవండి: హీరోపై లైంగిక ఆరోపణలు.. అవకాశాల పేరుతో వాడుకున్నాడని మహిళ ఫిర్యాదు!

‘ఇండియన్ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో సంవత్సరంలో దాదాపు వెయ్యి సినిమాలు విడుదల అవుతుంటాయి. అన్ని సినిమాల్లో కేవలం రెండు సినిమాలు మాత్రమే(RRR, కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2 సినిమాలను ఉద్దేశించి) ట్రెండ్‌ ను ఎలా నిర్దేశిస్తాయి? అయినా రీమేక్‌ చేస్తున్నాం అంటే బాలీవుడ్ లో టాలెంట్ కు కొరత ఉందని కాదు’ అంటూ అభిషేక్‌ బచ్చన్‌ వ్యాఖ్యానించాడు. అయితే దక్షిణాది సినిమాలపై బీటౌన్‌ నుంచి ఎందుకు ఇన్ని విమర్శలు వస్తున్నాయన్నది మాత్రం మిలన్ డాలర్‌ ప్రశ్న అనే చెప్పాలి. అంటే వాళ్లు కష్టపడి తెరకెక్కించిన సినిమాల కంటే.. సౌత్‌ సినిమాలను ఆదరించడం వారికి గొంతు మింగుడు పడకుండా చేస్తోంది కాబోలు? అని సినీ ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు. అభిషేక్ బచ్చన్‌ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.