బయోపిక్ గా రానున్న వరల్డ్ చెస్ ఛాంపియన్‏ విశ్వనాథన్ ఆనంద్ జీవిత చరిత్ర!

Vishwanath Anand Biopic - Suman TV

విశ్వనాథన్ ఆనంద్.. చెస్ ఛాంపియన్ గా వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్న ఆటగాడు. ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్ సెన్‏తో సైతం పోటీ పడ్డాడు ఆనంద్. ఇక దీంతో పాటు ఏకంగా ఐదు సార్లు వరల్డ్ చెస్ ఛాంపియన్‏గా రికార్డును సాధించాడు విశ్వనాథన్ ఆనంద్. ఈ దిగ్గజ ఆటగాడిపై తాజాగా ఓ వార్త నెట్టింట్లో కాస్త వైరల్ గా మారింది. అదేంటంటే..? క్రీడా రంగంలో అద్భుతాలు సృష్టించిన ఎంతో మంది ఆటగాళ్ల జీవిత చరిత్రను తెరపై బయోపిక్ లా చూపిస్తున్నారు నేటి తరం దర్శకులు.

అలా అనేక మంది క్రీడాకారులు జీవిత చరిత్రలు బయోపిక్ లుగా వచ్చి సక్సెస్ అయ్యాయి. అయితే తాజా సమాచారం ప్రకారం విశ్వనాథన్ ఆనంద్ జీవిత చరిత్రను కూడా బయోపిక్ రూపంలో తెరపైకి తీసుకురావటానికి అనేక చర్చలు కూడా జరుగుతున్నాయట. ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్ లో ఈ బయోపిక్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

Vishwanath Anand Biopic - Suman TVఇదే అంశంపై స్పందించిన విశ్వనాథన్ ఆనంద్.. నా బయోపిక్ తెరకెక్కించేందుకు అంగీకరించాను. ఈ నేపథ్యంలోనే నీ జీవిత రహస్యాలను, సాధించిన విజయాలను నిర్మాతలకు చెప్పానని, త్వరలో దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా మొదలవుతాయంటూ విశ్వనాథన్ ఆనంద్ తెలిపారు. మరి నిజంగానే ఆనంద్ జీవిత చరిత్ర తెరపైకి బయోపిక్ గా వస్తుందా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.