అమీర్ ఖాన్ ను చేసుకున్నవారి దాంపత్య జీవితం 15 ఏళ్లేనా!

Amir Khan Fatima Sana Shaik

సాధారణంగా సినీపరిశ్రమలో ఒకరితో సహజీవనం చేస్తూ.. మరొకరిని పెళ్లి చేసుకోవడం లేదా తన భార్యకు విడాకులు ఇచ్చి మరొకరిని పెళ్లి చేసుకోవటం వంటివి సర్వ సాధారణంగా జరుగుతాయి. ఈ కల్చర్ అన్ని పరిశ్రమల్లో ఉన్న బాలీవుడ్ కాస్తా ఎక్కువగా కనిపిస్తుంది. వారిలో ఒకరైన స్టార్ హీరో అమీర్ ఖాన్ మూడో పెళ్లికి సిద్ధమయ్యారని బాలీవుడ్ సమాచారం.

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తన రెండో భార్య కిరణ్ రావు నుంచి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన సంగతి మనందిరికి తెలిసిందే. అయితే ఆయన ఒక నటితో ప్రేమలో ఉన్నట్లు.. అందుకే కిరణ్ రావుకి విడాకులు ఇచ్చి త్వరలోనే మూడో పెళ్లి చేసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తమ 15 ఏళ్ల వైవాహిక జీవితానికి ఫుల్స్టాప్ పెడుతున్నట్టు అమీర్ ఖాన్, కిరణ్ రావ్ దంపతులు ప్రకటించారు. యాదృశ్చికమో లేదా మరేమో కానీ అమీర్ ఖాన్ తన మొదటి భార్య నరీనా దత్తాతో కూడా వివాహాం అయిన 15 ఏళ్ల విడాకులు ఇచ్చాడు.

అమీర్ ఖాన్ కు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఎప్పుడైతే కిరణ్ రావుతో విడాకులకు సిద్ధమైయాడో అప్పటి నుంచి ఆయనను ఎంతగానో అభిమానించే వారు కూడా ఆయన మీద కోపంగా ఉన్నారు. తమ వైవాహిక జీవితంలో ఎన్నో తీపి జ్ఞాపకాలు, ఆనందాలు, హాయిగా గడిపిన రోజులు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అమీర్ ఖాన్, కిరణ్ రావులు వెల్లడించారు. ఇకపై తాము తమ జీవితాల్లో కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టాలని భావిస్తున్నట్టు అభిమానులకు తెలిపారు.

మొదటి వివాహం రీనా దత్తాతో..

1986 రీనా దత్తాని అమీర్ ఖాన్ పెళ్లి చేసుకున్నాడు.ఈ జంటకు జునైద్ ఖాన్, ఇరా ఖాన్ సంతానం. పదహారేళ్లపాటు ఆమిర్- రీనా కాపురం సాఫీగా సాగిపోయింది. ఆ తర్వాత అభిప్రాయ బేధాలు తలెత్తిన కారణంగా స్నేహ పూర్వకంగానే విడిపోతున్నట్లు ప్రకటించారు. 2002లో వివాహ బంధానికి స్వస్తి పలికారు.

రెండవ వివాహం కిరణ్ రావుతో…

అమీర్ ఖాన్ మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత, 2005లో కిరణ్ రావును రెండవ పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ దంపతులు ఇటువంటి సంచలన నిర్ణయం తీసుకోవటం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మూడో వివాహం ఫాతిమా సనషేక్ తో?

Amir Khan Fatima Sana Shaik

‘దంగల్’ చిత్రంలో అమీర్ ఖాన్ కి కూతురు గా నటించిన నటి ఫాతిమా సన షేక్ తో అమీర్ ఖాన్ ప్రేమలో ఉన్నాడని సమాచారం. అందువల్లనే ఆమెను అమీర్ ఖాన్ తన తర్వాత చిత్రమైన ‘ది థగ్స్ అఫ్ హిందూస్తాన్’ చిత్రంలో నటించడానికి అవకాశం కూడా ఇచ్చారని సమాచారం.అయితే ఈ బాలీవుడ్ నటుడు విడాకులు తీసుకోడానికి ఆ ఆమె కారణం అని సోషల్ మీడియా తో పాటు బాలీవుడ్ లోనూ టాక్.

ముంబైకి వచ్చిన ప్రతిసారి ఫాతిమా.. అమీర్ ను తప్పనిసరిగా కలుస్తుందని, వీరిద్దరూ కలిసి చాలా పార్టీలకి కూడా హాజరయ్యారని బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ప్రస్తుతం 29 ఏళ్ళు ఉన్న ఈ భామ 1992 లో హైదరాబాద్ లో జన్మించింది. ఈమె 2016 లో చాచి 420, వన్ 2 కా 4 వంటి చిత్రాల్లో నటించింది. అమీర్ ఖాన్ విడాకుల వ్యవహారం సద్దుమణిగాక ఈ భామని పెళ్లి కూడా చేసుకోబుతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.