మంచు విష్ణుతో బాలకృష్ణ భేటీ.. ‘మా’ఎన్నికల్లో ట్విస్ట్!

సాధారణ ఎన్నికలను తలదన్నే విధంగా మా ఎన్నికల పోరు కొనసాగుతుంది. ఎవరు ఎవరికి మద్దతు ఇస్తున్నారు.. ఎవరు ఎప్పుడు పోటీ చేస్తున్నారు.. తప్పుకుంటున్నారు అన్న విషయం పై రోజుకో ట్విస్ట్ నెలకొంటుంది. ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు ఇద్దరూ ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఆయన ‘అఖండ’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ సమయంలోనే బాలయ్యను విష్ణు కలిశారు.

bafg minమొదటి నుంచి మంచు విష్ణుకి బాలయ్య సపోర్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. తన ఆలోచనలను బాలకృష్ణకు వివరించిన విష్ణు మద్దతివ్వాలని కోరారు. అందుకు బాలకృష్ణ తన పూర్తి మద్దతు విష్ణుకే అని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బాలకృష్ణ తనకు మద్దతు తెలిపారని విష్ణు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ‘‘నట సింహం బాలా అన్నా.. మీ మద్దతుకు ధన్యవాదాలు. మా ఎన్నికల్లో నాకు మద్దతుగా నిలవడం చాలా గర్వంగా ఉంది’’ అని పేర్కొన్నారు.

prage minఇదిలా ఉంటే.. ప్రకాష్ రాజ్ కూడా ప్రచారం జోరు పెంచారు. ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్‌లో నటీనటులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అందరికీ లంచ్ పార్టీ ఇచ్చారు. ‘మా’ సంక్షేమం కోసం తాను చేపట్టబోయే పనుల కోసం వారికి వివరించారు. మొత్తానికి మా ఎన్నికలు రోజు రోజుకీ రసవత్తరంగా మారుతున్నాయి.