బక్రీద్ పండగ…ప్రపంచ వ్యాప్తంగా ఉండే ముస్లింలందరు భక్తి శ్రద్ధలతో జరుపుకునే పవిత్రమైన పండగ. ఈ శుభ కార్యాన్ని ముస్లింలు ఎంతో పవిత్రంగా జరుపుకుంటారు. త్యాగానికి పవిత్రంగా నిలిచే ఈ పండగకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక ముఖ్యంగా ముస్లింలు అతి పవిత్రంగా భావించే ఈ పండగ వెనుక మనకు తెలియని ఎన్నో నిజాలు దాగి ఉన్నాయి. అసలు బక్రీద్ పండగ రోజు జంతు బలిని ఎందుకిస్తారనేది చాల మందికి తెలియదనే చెప్పాలి.
ఇక అసలు విషయానికొస్తే..ముస్లింలు హజ్రత్ ఇబ్రాహీమ్, హజ్రత్ ఇస్మాయీల్ అలైహిముస్సలాంల త్యాగాలను స్మరించుకుంటూ ఈ పండగను జరుపుకుంటున్నారు. ముస్లింలు అతి పవిత్రంగా భావించి జిల్ హజ్ మాసంలో పదవ తేదీన జరుపుకొనే అపూర్వమైన పండగనే బక్రీద్. త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పండుగను ఈదుల్ జుహా అని కూడా అంటారు. ఈ పండగను మూడు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు ముస్లింలు.
బక్రీద్ రోజున ఖుర్బానీ ఇవ్వడం అంటే ఈరోజున భారీగా జంతుబలి ఇవ్వటం జరుగుతోంది. ముస్లింల ప్రతి ఇంట్లో జంతు బలిని ఇచ్చి వారు తీసుకోవటంతో పాటుగా అనాధలకు పంచిపెడతారు. తమ బంధువులకు, స్నేహితులకుఎం కూడా బలిచ్చిన మాంసాన్ని పంచిపెడతారు. ఇక నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ముస్లింల ప్రతి ఇంట పండగ వాతావరణం ఉంటుందనే చెప్పాలి. మసీదులకు వెళ్లి ప్రార్ధనలు చేసి తమ ఇష్ట దైవాన్ని కొలుచుకుంటారు. దీంతో నేడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముస్లింలందరికి ఏపీ ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, రెండు రాష్ట్రాల గవర్నర్ లు ముస్లింలకు బక్రీద్ పండగ శుభాకాంశాలు తెలియజేశారు.