జొయోని ఇ’స్మార్ట్’ ఫోన్ ఎన్నో ఫీచర్లు… తక్కువ ఖరీదు!

ఇంటర్నెట్ ఆవిష్కారమై దశాబ్దాలు గడిచినా అది సామాన్యుడి అరచేతిలో ప్రపంచాన్ని ఇమిడ్చింది మాత్రం ఈ దశాబ్దే.  ఈ పదేళ్లో వచ్చిన టెక్నాలజీ మార్పులు, మరే దశాబ్దిలోనూ మానవుని జీవన విధానాన్ని ఇంతలా మార్చలేదు.   అలాంటి విప్లవాత్మక మార్పులన్నీ ఈ ఒక్క దశాబ్దిలోనే చోటు చేసుకున్నాయి.   అత్యధిక ర్యామ్, అల్ట్రా స్పీడ్ ప్రాసెసర్లు, జీబీల కొద్దీ ఇంటర్నల్ స్టోరేజ్, వందకు పైగా మెగాపిక్సెళ్ల కెమరాలు, ఒకేఫోన్లో నాలుగైదు కెమెరాలతో తన సామర్థ్యాన్నే కాదు మడత పెట్టే టచ్ స్క్రీన్ ఫోన్లు సాకారమైపోయాయి. జియోనీ తన కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. అయితే ఇది మొదట నైజీరియాలో మాత్రమే లాంచ్ అయింది.

Gionee compressedఇందులో ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ90 ప్రాసెసర్‌ను అందించనున్నారు.  48 మెగాపిక్సెల్ కెమెరాను ఇందులో జియోనీ అందించింది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.16,000 ఉండగా, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.18,700 నిర్ణయించారు.

డాజ్‌లింగ్ బ్లాక్, మ్యాజిక్ గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై జియోనీ ఎం15 పనిచేయనుంది. ఇందులో 6.67 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గా ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకోవచ్చు.