కెప్టెన్సీ గోల.. కాజల్ సీరియస్.. ఏడ్చేసిన సరయు..

తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 మూడో రోజు పూర్తయ్యింది. అప్పుడే హౌజ్ లో తిట్టుకోవడాలు.. టాస్కులు.. గ్రూపులు.. ఏడుపు అన్నీ మొదలయ్యాయి. ఈ రోజు (గురువారం) 5వ ఎపిసోడ్‌లో సైకిలింగ్ టాస్క్‌తో బిగ్ బాస్.. హౌస్‌మేట్స్ మధ్య పుల్లలు పెట్టేందుకు సిద్ధమయ్యాడు. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో హౌస్‌మేట్స్ పెద్ద గందరగోళం చెలరేగుతున్నట్లు కనిపిస్తుంది.

bigaj minప్రోమో ప్రకారం.. ఆర్జీ కాజల్, యూట్యూబ్ స్టార్ సరయు మధ్య వాగ్వాదం నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ ఇంటికి మొదటి కెప్టెన్ ఎవరిని ఎంచుకోవాలన్న విషయాన్ని ప్రియాంక ఇంటి సభ్యులకు చదివి వినిపించింది. ఈ టాస్క్ లో ఒకరిని మించిన పర్ఫామెన్స్ మరొకరు చేస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే ఈ విషయంలోనే కాజల్ కి సరయుకి మద్య మాటల యుద్దం అయ్యింది. ఇద్దరు అబ్బాయిలు ఉండగా ఒక్కరినే ఎందుకు టార్గెట్ చేశావని కాజల్ పై సిరియస్ అయ్యింది సరయు. దాంతో కాజల్ చేయి చూపిస్తూ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.

ఇక యాంకర్ రవి సన్నితో ఆ మాట వస్తే నా మెడ కోసుకుంటా నీ ఎదురుగా అంటున్నాడు. ఈ సందర్భంగా సరయు సెకండ్ డే ఎంత బాగుంది.. ఫోర్త్ డే ఇలా గ్రూపులు తయారయ్యాయి అంటూ కన్నీరు పెట్టుకుంది.  తాజాగా తెరపైకి కెప్టెన్సీ బాంబ్ , సైకిల్ టాస్క్. ఇది కెప్టెన్సీ కోసం బిగ్ బాస్ పెట్టిన టాస్క్.. పవర్ హౌస్‌లోకి వెళ్లిన విశ్వ, సిరి, మానస్, హమీదాలకు కెప్టెన్సీ టాస్క్‌లో పాల్గొనే అవకాశం లభించింది. మరి ఎవరు బిగ్ బాస్ 5 మొదటి కెప్టెన్ అవుతారో చూడాలి.