సీనియర్ హీరోయిన్ సౌందర్య నటించిన శ్వేతనాగు సినిమా చూసిన తర్వాత.. అసలు అలాంటి పాము ఉంటుందా అన్న సందేహం రావడం కామన్. అత్యంత అరుదుగా మాత్రమే ఇలాంటి పాములు కనిపించడం అందుకు కారణం. తాజాగా శ్వేతవర్ణంలో ఉన్న ఓ కోబ్రా కర్ణాటక శివమొగ్గలో ప్రత్యక్షమయ్యింది.
సాధారణంగా కోబ్రాలు గోధుమ, నలుపు రంగుల్లో ఉంటాయి. కానీ, ఈ పాము పూర్తిగా తెలుపు రంగులో ఉంది. కర్ణాటక శివమొగ్గలోని సహ్యాద్రి నారాయణ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి వెనుక ఉన్న ఓ ఇంట్లో ప్రత్యక్షమైంది. కట్టెల కుప్పలో కనిపించిన ఈ అరుదైన శ్వేతనాగును అల్బినో కోబ్రాగా పిలుస్తారు. దీంతో సమాచారం అందుకున్న రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని పామును పట్టుకుంది. అటవీశాఖ అనుమతితో ఈ సర్పాన్ని అడవిలో విడిచిపెడతామని రెస్క్యూ టీం చెప్పింది. చర్మ, రక్త సంబంధిత కారణాల వల్లే ఇలా పాములకు ఇలాంటి శ్వేతవర్ణం వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: వీడియో: ఇది పబ్లిక్ ప్లేస్! వద్దంటూ యువకుడు వారిస్తున్నా వినకుండా.. యువతి ఏం చేసిందంటే!
ఇది కూడా చదవండి: వైరల్ వీడియో: ఇదేం గొడవ రా బాబు!.. ప్రియుడి కోసం యువతుల స్ట్రీట్ ఫైట్!