ఫోన్ల తయారీ కంపెనీ ఏదైనా సరై.. మా ఫోన్లు వాడండి.. మా ఫోన్లు వాడండి అంటూ ప్రకటనలో ఉక్కిరిబిక్కిరి చేయడం చూస్తున్నాం.. భరిస్తున్నాం. కానీ ఫోన్లు స్వీచ్ ఆఫ్ చేయండి.. మీ పిల్లలతో కాస్త సమయం గడపండి అంటూ ప్రముఖ ఫోన్ల కంపెనీ మాత్రం వినూత్న రీతిలో ఒక యాడ్‌ను రిలీజ్ చేసింది.
ఇండియాలో తక్కువ సమయంలోనే భారీ ప్రచుర్యం పొందిన ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ ‘వివో’ విడుదల చేసిన ఒక యాడ్ ట్విట్టర్‌లో ట్రెండింగ్ అవుతోంది. ఆ యాడ్ చూసిన వారిని ఒక నిమిషం ఆలోచింప చేసేలా ఉన్నాయి అందులో సంభాషణలు. కార్లో తండ్రి, కొడుకు వెళ్తుంటారు.. తండ్రి బీజీగా ఫోన్ చూస్తూ ఉంటాడు. చిన్నారి.. ‘నాన్న మనం ఇంతకుముందులా మాట్లాడుకోట్లేదు. మీ జోక్స్ చెప్పట్లేదు’ అంటూ మనసు చిన్నబుచ్చుకుంటాడు. తండ్రి.. కొడుకు బాధను అర్థం చేసుకుని ఫోన్‌ను స్వీచ్ ఆఫ్ చేసి.. మళ్లీ జోక్స్ చెప్పనా అంటాడు. దీంతో పిల్లాడు సంతోషంతో తండ్రిని చుట్టుకుంటాడు.
74 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలతో ఆనందంగా కొంత సమయం గడపలేకపోతున్నారు. ఈ విషయాన్ని కూడా యాడ్‌లో చెప్పింది వీవో. ఇలా తమ మానవ సంబంధాలపై తమ ప్రొడక్ట్ ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో.. చెప్తు.. ఫోన్ స్వీచ్ ఆఫ్ చేసి.. కొంత సమయంలో పిల్లలతో గడపండని చెప్పే యాడ్‌తో వివో నెటిజన్లను ఆకట్టుకుంది. దీంతో ఈ యాడ్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. మరి ఈ యాడ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: బిచ్చగాడి బ్యాగ్ లో కట్టల కొద్దీ డబ్బులు! వీడియో వైరల్!
As we get ready for a New Year, a fresh start, let’s choose to switch off and find greater joy in connecting with our loved ones.#HappyNewYear #SwitchOff pic.twitter.com/MoPmnqu84C
— Vivo India (@Vivo_India) December 16, 2021