సాధారణంగా కొంత మంది పాట పాడితే ప్రకృతి పులకించి పోతుంది.. ఆ మధుర స్వరాన్ని ఆస్వాదిస్తూ తన్మయత్వంలో మునిగిపోతారు. అదే కొంత మంది పాడితే.. డబ్బాలో గులకరాళ్లు వేసి ఊపినట్లు.. కర్ణకఠోరంగా ఉంటుంది. ఆ మద్య వచ్చిన శుభాకాంక్షలు చిత్రంలో ‘ఆడ్డవే మయూరా.. నటనమాడ్డవే మయూర్రా…’ అంటూ ఏవీఎస్ పాట విని అక్కడ జనాలు.. పశువులు పారిపోతాయి.
నిజ జీవితంలో కూడా అప్పుడప్పుడు అలాంటి సంఘటనలు తారస పడుతుంటాయి. మరీ అంతగా కాకున్నా ఓ పెద్దావిడ పాడిన పాటకు ఓ జంట పడ్డ కష్టాలు.. బాధ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ‘వామ్మో ఇదేం పాటరా నాయానో జుట్టు పీక్కోవాలనిపిస్తోంది’ అని ఈ పెద్దావిడ పాడిన పాట విన్న నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘ఆలయాన వెలసిన ఆ దేవుని రీతీ.. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతీ’ అంటూ అదో రకమైన గొంతుకతో ఓ మహిళ పాడుతూ.. కోరస్ కూడా ఇవ్వడంతో అక్కడ ఉన్నవారికి మూర్చ వచ్చినంత పనైంది.
ఆ స్వరం వింటూ.. మనస్సు కకావికలమై బంధువులు పడిన అవస్థ వర్ణనాతీతం. ఆమె పాడుతున్నంత సేపు ఆ కొత్త జంటను సిగ్గు, బాధతో గోడకు అతుక్కు పోయేలా చేసింది. రెండు నిమిషాల కంటే ఎక్కువ నిడివి ఉన్న ఈ పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెళ్లై కొత్తగా ఇంటికి వచ్చిన జంట ముందు ఎవరినీ తొందరపడి పాడవొద్దు.. కొంపదీసి ఇలాంటి సంఘటన మీకూ ఎదరు కావొచ్చు అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.