ప్రజాప్రతినిధులు అంటే ఎప్పుడూ వైట్ అండ్ వైట్ డ్రెస్ లో కనిపిస్తుంటారు. నిత్యం వారు తమ కార్యకలాపాలలో బిజీగా ఉండారు. అదే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అయితే ఇంక చెప్పనక్కర్లేదు.. అధికారిక వ్యవహారాల్లో ఎప్పుడూ తీరిక లేకుండా ఉంటారు. అయితే అప్పుడప్పుడు కొందరు ముఖ్యమంత్రులు, మంత్రులు తమ న్యూలుక్ తో అందరిని ఆకట్టుకుంటారు. తాజాగా ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ భగేల్ కొత్త అవతారమెత్తారు. రాష్ట్ర ఆధికారిక వ్యవహారాల్లో ఎప్పుడు బిజీగా ఉండే ఆయన బైక్ రైడర్ మారి.. రయ్యిరయ్యిమంటూ దుసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ అడ్వెంచర్ స్పోర్ట్స్ ను ప్రోత్సహించేందుకు ఈ నెల 5,6 తేదీల్లో నేషనల్ సూపర్ క్రాస్ బైక్ రేసింగ్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ ఈవెంట్ ను ప్రమోట్ చేసేందు ఏకంగా ఆ రాష్ట్ర సీఎం భూపేశ్ భగేల్ స్పోర్ట్ బైక్ రైడర్ గా మారారు. రెడ్ జాకెట్, సన్ గ్లాసెస్, హెల్మెట్ ధరించి బైక్ రైడింగ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను అక్కడి సీఎంవో కార్యాలయం ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. దీంతో ఒక్కసారి గా ఈ వీడియో వైరల్ అయింది. ఎప్పుడు కుర్తా, పైజామాలో కనిపించే తమ నేత ఇప్పుడు నయా ల్యూక్ లో ట్రెండిగా కనిపిచడం పట్ల సీఎం అభిమానలుతో పాటు అందరు ఆశ్యర్యపోయారు. బాలీవుడ్ హీరోను తలపించేలా ఉన్న భగేల్ బైక్ రైడింగ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Let’s make this weekend memorable with CGMSA
You are welcome on 5-6th of March for an epic event under graceful & youth oriented leadership of CM Shri @bhupeshbaghel.Join National Supercross Bike Racing & Ride with Pride
Venue : Outdoor Stadium
Budhatalab Raipur
Time : 4 PM pic.twitter.com/Pxya01cWop— CMO Chhattisgarh (@ChhattisgarhCMO) March 2, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.