భర్త ప్రియురాలితో ఉండగా అతని భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. దీనికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.
ఈ మధ్యకాలంలో కొందరు పెళ్లైన వ్యక్తులు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. కట్టుకున్న వాళ్లను కాకుండా సీక్రెట్ గా మరొకరిని మెయింటెన్ చేస్తూ చీకటి కాపురాన్ని నడిపిస్తున్నారు. అసలు విషయం బయటపడకుండా రొమాన్స్ చేస్తూ సంసారాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ఇక అసలు విషయం బయటపడడంతో హత్యలు చేయడం, లేదంటే ఆత్మహత్యలు చేసుకోవడం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఓ మహిళ ఆమె భర్త ప్రియురాలితో బెడ్ రూమ్ లో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.
అది ఉత్తర్ ప్రదేశ్ లోని రాయబరేలి ప్రాంతం. ఇక్కడే హేమంత్-స్వాతి దంపతులు నివాసం ఉంటున్నారు. భర్త లాయర్ గా పని చేస్తున్నారు. పెళ్లైన చాలా కాలం పాటు ఈ భార్యాభర్తలు సంతోషంగానే జీవించారు. కానీ, ఈ మధ్య కాలంలో భర్త హేమంత్ ఓ యువతితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. ఇక సమయం దొరికినప్పుడల్లా ప్రియురాలితో సినిమాలు, షికారులు అంటూ తెగ తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. అప్పుడప్పడు ప్రియురాలితో హోటల్ కు వెళ్తూ రొమాన్స్ చేసేవాడు. అయితే, భర్త రంకుపురాణం ఇటీవల భార్య స్వాతికి తెలిసింది. ఎలాగైన భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని అనుకుంది. ఆ సమయం కోసం వేచి చూసింది.
ఇకపోతే, ఇటీవల భర్త ప్రియురాలితో హోటల్ కు వెళ్లాడని భార్య తెలుసుకుంది. స్వాతి తన కుటుంబ సభ్యులను కొందరిని వెంట బెట్టుకుని భర్త ఉన్న హోటల్ కు వెళ్లింది. వాళ్లున్న గదిలోకి వెళ్లి భర్తను ప్రియురాలితో ఉండగా స్వాతి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. దీనిని స్వాతి కుటుంభికులు మొబైల్ లో వీడియోలు తీసుకున్నారు. అదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కాస్త వైరల్ గా మారింది. ఆ తర్వాత స్వాతి భర్త తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నా.. సరైన న్యాయం చేయాలని వాపోయింది. ఇదే అంశం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమంగా మారింది.
— krishna veni (@krishna66577649) June 21, 2023