బుధవారం రాత్రి లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఓ సంగీత కచేరిలో ప్రముఖ హాలీవుడ్ సింగర్ అవా మాక్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఎన్నో పాటలు పాడుతూ శ్రోతులను ఉర్రూతలూగించింది. అయితే, ఓ యువకుడు స్టేజ్ పైకి ఎక్కి సింగర్ అవా మాక్స్ కు షాకిచ్చాడు. ఆ యువకుడు చేసిన పనికి అవాకవ్వడం అందరి వంతైంది.
చిత్ర పరిశ్రమలో హీరో, హీరోయిన్లకే కాకుండా సింగర్స్ కు కూడా పెద్ద ఎత్తున అభిమానులు ఉంటారు. వాళ్లు ఎక్కడ సంగీత కచేరి ఏర్పాటు చేస్తే అభిమానులు అక్కడ వాలిపోతుంటారు. అచ్చం ఇలాగే ఓ అభిమాని.. ప్రముఖ సింగర్ అవా మాక్స్ ప్రోగ్రామ్ కు హాజరయ్యాడు. ఆమె పాడే పాటలను వింటూ బాగానే ఎంజాయ్ చేశాడు. అయితే, ఓ యువకుడు ఉన్నట్టుండి స్టేజ్ పైకి వెళ్లాడు. అక్కడి ఉన్నవారందని తోసుకుంటూ వెళ్లాడు. సాంగ్ పాడుతుండగా ఆ సింగర్ వద్దకు వెళ్లి అభిమాని అందరి ముందే ఆమెకు షాకిచ్చాడు. ఇదే వీడియో సోషల్ మీడియలో కాస్త వైరల్ గా మారింది. ఇంతకు ఆ అభిమాని చేసిన పని ఏంటంటే?
అసలు విషయం ఏంటంటే? బుధవారం లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఓ సంగీత కచేరిలో ప్రముఖ హాలీవుడ్ సింగర్ అవా మాక్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తన పాటలతో శ్రోతులను ఉర్రూలతూగించింది. ఈ కార్యక్రమానికి ఆమె అభిమానులు ఎంతో మంది వచ్చారు. అయితే, అవా మాక్స్ సాంగ్స్ పాడుతుండగా ఓ అభిమాని స్టేజ్ మీదకు ఎక్కాడు. వెళ్తూ వెళ్తూనే ఆమె చెంపపై బలంగా కొట్టాడు. దీంతో వెంటనే స్పందించిన నిర్వాహకులు.. అతనిడి కిందకు దింపారు. ఉన్నట్టుండి ఆ యువకుడు అలా చేయడంతో అవా మాక్స్ ఒక్కసారిగా షాక్ గురైంది. ఈ ఘటనపై ఆ సింగర్ అవా మాక్స్ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ట్విట్టర్ ఆమె పోస్ట్ చేస్తూ.. రాత్రి జరిగిన కార్యక్రమంలోనే ఓ యువకుడు నా చెంపపై బలంగా కొట్టాడు. నా ముఖానికి, కంటికి గాయాలయ్యాయి. అతడు ఇక నుంచి నా ప్రోగ్రామ్స్ కు రాడు.., రాలేడు అంటూ రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే, ఆ యువకుడు అవా మాక్స్ పై దాడి చేస్తుండగా కొందరు వీడియోలు తీసుకున్నారు. అదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది.
Someone jumped on stage at the end of tonight’s show in Los Angeles.
This is a reminder that this behavior is unacceptable. Sending all our love to Ava and her crew. pic.twitter.com/Rs0IFSn2Xp
— Ava Max Source (@SourceAvaMax) June 21, 2023