గత కొంత కాలంగా తెలంగాణలో రాజకీయాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. అధికార పక్షం వర్సెస్ బీజేపీ, కాంగ్రెస్ ల మద్య హూరా హోరీ మాటల యుద్దం నడుస్తుంది. తాజాగా కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ముందస్తు ఎన్నికలు రావడం ఖాయమని అన్నారు. సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గ డిజిటల్ సభ్యత్వ నమోదు సమీక్షా సమావేశానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జె.గీతారెడ్డి, నల్లగొండ పార్లమెంటు సభ్యులు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి లు హాజరయ్యారు.
ఈ సందర్బంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో రైతు సంబరాలు వికారంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయమని ఆయన జ్యోస్యం చెప్పారు. టీఆర్ ఎస్ పార్టీ మేనిఫెస్టో దోచుకో దాచుకో అన్న చందంగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం సాండ్, ల్యాండ్, మైన్స్, వైన్స్ లక్ష్యంగా పాలన సాగిస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే దేశం అభివృద్ధి పథంలోకి వచ్చిందని ఉత్తమ్ స్పష్టం చేశారు.
ఇది చదవండి: వారికి మాస్క్ లు అవసరం లేదు.. కేంద్ర ప్రభుత్వ కొత్త గైడ్ లైన్స్!
బీజేపీ తరహాలో విభజించి పాలించడం కాంగ్రెస్ పార్టీ నైజం కాదని అన్నారు. ఎందరో అమరుల త్యాగ ఫలం సోనియాగాంధీ కృషి వల్లనే తెలంగాణ వచ్చిందని, సూర్యాపేట కాంగ్రెస్ సభ్యత నమోదు దేశంలోని ఆదర్శంగా ఉందని, కాంగ్రెస్ విజయాన్ని మోడీ, కేసీఆర్ లు ఆపలేరన్నారు.