గుట్టచప్పుడు కాకుండా హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహబూబాబాద్ లో జిల్లా కేంద్రంలో కొంతమంది మహిళలు వ్యభిచార గృహాలు నడిపిస్తున్నారనే పక్క సమాచారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కొందరు మహిళలను, విటులను పట్టుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కొంతమంది మహిళలు వ్యభిచార గృహాలు నడిపిస్తూ జీవనం సాగిస్తున్నారు. పేద యువతులకు డబ్బు ఆశ చూపి ఈ వృత్తి లోకి దింపుతున్నారు. గతంలో జిల్లా కేంద్రం శివారులో నడిచే ఈ వ్యభిచార గృహాలు, ప్రస్తుతం జిల్లా కేంద్ర నడిబొడ్డులో.. పోలీసులకు అనుమానం రాకుండా నిర్వహిస్తున్నారు. నిర్వాహకులు తమ కస్టమర్లకు వాట్సప్ ద్వారా యువతుల ఫోటోలు పంపి ఆకర్షిస్తూ.. వ్యభిచారం నిర్వహిస్తున్నారు.
ఎవరికి అనుమానం రాకుండా కొందరు భార్యాభర్తలుగా కలిసి యువతులతో ఈ అక్రమ దందా కొనసాగిస్తున్నారు. కొందరు ప్రముఖుల వద్దకే యువతులను పంపిస్తున్నారు. ఫ్యామిలీతో అద్దెకు ఉంటున్నట్లు ఎవరికి అనుమానం రాకుండా జాగ్రత్తలు పడుతూ, పోలీసుల కళ్లు కప్పుతున్నారు. ఈ క్రమంలో పక్క సమాచారం అందుకున్న పోలీసులు పలు వ్యభిచార గృహాల పై ఆకస్మిక తనిఖీలు చేసి మహిళలను, విటులను అదుపులోకి తీసుకున్నారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.