నవ మోసాలు మోసి, కనిపెంచిన తల్లికి వృద్ధాప్యం రాగానే తమకు బరువుగా భావిస్తున్నారు కొందరు పుత్రరత్నాలు. తాము అర్థాకలితో ఉంటూ పిల్లలకు మాత్రం కడుపు నిండా ఆహారం అందిస్తుంటారు తల్లిదండ్రులు. రేయింబవళ్లు కష్టపడి పిల్లలను పెంచి పెద్ద చేసి.. ఓ ఇంటి వారిని చేస్తారు. ఇంతాల తమ జీవితానికి ఆధారమైన తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి రాగానే బిడ్డలు భారంగా భావిస్తున్నారు. నేటికాలంలో కొందరు కుమారులు తల్లిదండ్రులపై కాఠిన్యం ప్రదర్శిస్తున్నారు. అంతేకాక తమను పెంచి పెద్ద చేసిన తల్లిని పోషించే విషయంలో అన్నదమ్ములు ఘర్షణ పడుతున్నారు. తనకు ముద్ద అన్న పెట్టడానికి ఇబ్బంది పడుతున్న పుత్రులను చూసి.. ఆ తల్లులు బతికున్న శవాలా మారిపోతున్నారు. తాజాగా అలానే తల్లిని పెంచలేమంటూ గొడవకు దిగిన అన్నదమ్ములకు కోర్టు జైలు శిక్ష విధించింది.ఈ ఘటనే హైదరాబాద్ చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరం లోని న్యూబోయిన్ పల్లికి చెందిన గువ్వల రాములు(42), సాయిలు(41) అన్నదమ్ములు. వీరిలో రాములు స్థానికంగా ఓ ప్రైవేటు కంపెనీలు ఉద్యోగం చేస్తున్నాడు. సాయిలో.. స్థానికంగా కూరగాయల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ప్రస్తుతం తల్లి.. చిన్న కుమారుడు సాయిలు వద్దనే ఉంటుంది. అయితే తల్లి పోషించే విషయంలో అప్పుడప్పుడు అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న ఘర్షణలు జరిగేవని సమాచారం. అలానే కొంతకాలం తల్లి.. సాయిలు వద్దనే ఉంటుంది. దీంతో ఆమెను చూసుకునే విషయమై మాట్లాడేందుకు సాయిలు జనవరి 5న .. అన్న రాములు వద్దకు వెళ్లాడు. తల్లిని పోషించే విషయంలో ఇరువురి మధ్య గొడవ జరిగింది. అనంతరం ఇద్దరు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఇద్దరూ పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం సికింద్రాబాద్ లోని 14వ స్పెషల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ న్యాయస్థానంలో హాజరుపరిచారు.
కేసును విచారించిన న్యాయమూర్తి.. ఆ అన్నదమ్ములకు బుద్ది వచ్చేలా తీర్పు ఇచ్చారు. అన్నదమ్ములిద్దరికీ రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. కని పెంచిన కన్నతల్లే.. ఇప్పుడు ఆ కుమారులకు బరువైంది. వృద్ధురాలైన ఆమెను నువ్వు చూడంటే.. నువ్వు చూడంటూ అన్నదమ్ములు ఘర్షణ పడ్డటంతో ఆ తల్లి బతికున్న శవంలా మారిపోయింది. మనం మన తల్లిదండ్రుల పట్ల ఎలా ప్రవర్తిస్తే.. మన పిల్లలు అలానే మన పట్ల ప్రవర్తిస్తారు అనే కనీస జ్ఞానాన్ని మరిచి ప్రవర్తిస్తున్నారు కొందరు పుత్ర రత్నాలు. మరి.. ఇలాంటి క్రూరమైన కుమారులను ఏం చేయాల్లో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.