హైదరాబాద్ లో ఓ పేలుడు ఘటన చోటు చేసుకుంది. భారీ పేలుడు శబ్ధం ధాటికి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఒకరు గాయపడినట్లు సమాచారం.
ఈ మధ్యకాలంలో ఏదో ఒక ప్రాంతంలో పేలుడు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కారణాలు ఏవైనప్పటికి ఎందరో అమాయకులు ఈ పేలుడు ఘటనలకు బలవుతున్నారు. నిన్ననే పశ్చిమ బెంగాల్లో ఓ బాణాసంచా దుకాణంలో పేలుడు సంభవించి తొమ్మిది మంది మరణించారు. తాజాగా హైదరాబాద్ లోనూ ఓ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి భారీ శబ్ధం రావడంతో స్థానికులు భయందోళనకు గురయ్యారు. హైదరాబాద్ లో తరచూ ఏదో ఒక ప్రాంతంలో పేలుడు ఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యం పారిశ్రామిక వాడ ప్రాంతాలైన జీడిమెట్ల, పటాన్ చెరువు ప్రాంతాల్లో ఈ తరహా ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
తాజాగా మణికొండ ప్రాంతంలో పేలుడు ఘటన చోటుచేసుకుంది. మణికొండ ప్రాంతంలోని లాలమ్మ గార్డెన్ లో పేలుడు సంభవించింది. ఈ ఘటన చెత్త ఏరుకుంటున్న ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. ఖాళీ ప్లాట్ లో ఉన్న చెత్త తీసుకుంటుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. భారీ శబ్ధం రావడంతో స్థానికులు ఒక్కసారిగా భయ భ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. కెమికల్ డబ్బాలు పేలినట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. పేలుడు జరిగిన ప్రాంతంలో జనాలు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.