స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న స్థానాలకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై తాజాగా హైకోర్టులో విచారణ జరగ్గా.. ఎన్నికల సంఘానికి నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ ఏప్రిల్‌కు వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.
న్యాయస్థానాలు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలానే ప్రభుత్వ పరిపాలనలో, ఎన్నికల విషయాల్లో తరచూ న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయి. పరిపాలన విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే నోటీసులు జారీ చేస్తుంది. ఇప్పటికే అనేక సందర్భాల్లో సుప్రీం కోర్టు, హైకోర్టులు ప్రభుత్వాలకు, వివిధ ప్రభుత్వ కమిషన్లకు ఎన్నో సూచనలు, హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారంటూ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఈ ఎన్నికలపై హైకోర్టులో విచారణ జరగ్గా.. ఎలక్షన్ కమిషన్ కి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కారణాలతో స్థానిక సంస్థల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల పోస్టులు మూడేళ్లుగా ఖాళీగా ఉన్నాయి. దీంతో ఈ విషయంపై ప్రముఖ న్యాయవాది రాపోలు భాస్కర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు విచారణ చేపట్టింది. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికలు ఇప్పటివరకు ఎందుకు నిర్వహించలేదని కోర్టు ప్రశ్నించింది.
ఖాళీగా ఉన్న సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనేది చెప్పాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పూర్తి వివరాలతో ఓ నివేదిక సమర్పించాలని హైకోర్టు నోటీసులు ఇచ్చింది. రాష్ట్రంలో ఎంపీటీసీ-94, వార్డు సభ్యులు-5362, సర్పంచ్-220, ఉపసర్పంచ్-344, జడ్పీటీసీ-3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులోనూ కొన్ని ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసిన స్థానాలు ఉన్నాయి. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఖర్చులకు సంబంధించిన అఫిడవిట్‌ను దాఖలు చేయకపోవడంతో కొంతమందిపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనర్హత వేటు వేసింది.
అలానే మరికొంతమంది అవిశ్వాస తీర్మానాల వల్ల పదవులకు రాజీనామాలు చేశారు. వివిధ కారణాలతో పలువురు రాజీనామా చేశారు. దీంతో మూడేళ్లుగా ఈ ఖాళీ స్థానాలకు ఎన్నికలు జరగలేదు. దీని వల్ల గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయాయని న్యాయవాది కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ను స్వీకరించిన కోర్టు విచారణ జరిపి.. ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ఖాళీ స్థానాలకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనేది చెప్పాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్‌కు వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. మరి.. ఎన్నికల సంఘానికి హైకోర్టు నోటీసులు జారీ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.