తెలంగాణలో ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడదల చేశారు.
లక్షలాది మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదుచూస్తున్న ఇంటర్ ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ పరీక్ష ఫలితాలు ఒకేసారి విడుదలయ్యాయి. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో కలిసి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడదల చేశారు. ఈ ఏడాది తెలంగాణలో మొత్తం 4.33 లక్షల మంది ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాయగా.. వీరిలో 63.85 శాతం మంది ఉతీర్ణులయ్యారు. ఇక 3.80 లక్షల మంది ఇంటర్ సెకండియర్ పరీక్షలకు హాజరవ్వగా.. వీరిలో 67.26 శాతం మంది ఉతీర్ణులయ్యారు.
మొత్తంగా ఈ ఫలితాలను చూస్తే, ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ రెండింటిలోనూ బాలికలే పైచేయి సాధించారు. ఫస్ట్ ఇయర్‌లో 68.85 శాతం మంది బాలికలు ఉతీర్ణులు అవ్వగా, 56.80 శాతం బాలురు పాసయ్యారు. అలాగే సెకండ్ ఇయర్‌లో 73.46 శాతం మంది బాలికలు పాసవ్వగా, 60.66 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్‌లో అత్యధిక శాతం మంది మేడ్చల్ జిల్లా(75.25) నుంచి ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. అలాగే సెకండియర్ ఫలితాల్లో అతధిక శాతం మంది ములుగు జిల్లా(80) జిల్లా నుంచి ఉతీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్లో మెదక్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది.
రీకౌంటింగ్/ రీవెరిఫికేషన్ చేయించుకోవాలనుకునే విద్యార్థులు మే 10 నుంచి మే 16 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సప్లిమెంటరీ పరీక్షలు రాయాలనుకున్న విద్యార్థులు మే 10 నుంచి మే 16వ తేదీలోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 4 నుంచి జూన్ 1వ తేదీ వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.
విద్యార్ధులపై ఒత్తిడి ఉండకూడదన్న కారణంగా ఎంసెట్ లో ఇంటర్ మార్కులను వెయిటేజీని తొలగించినట్టుగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ‘తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్’ 2022-2023 విద్యా సంవత్సరానికిగాను ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. గత మార్చి 15 నుంచి ఏప్రిల్ 4వరకు ఈ పరీక్షలు నిర్వహించగా, దాదాపు తొమ్మిదిన్నర లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో మొదటి సంవత్సరం పరీక్షలకు 4,33,501 మంది హాజరవ్వగా, రెండో సంవత్సరం పరీక్షలకు 3,80,929 మంది హాజరయ్యారు.
విద్యార్థుల కింద ఇవ్వబడిన లింక్స్ ద్వారా మీ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.