KCR: ఉమ్మడి జాబితా పేరుతో రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం పెరుగుతోందని, బలమైన కేంద్రం.. బలహీనమైన రాష్ట్రాలు అన్న సిద్ధాంతంతో ముందుకెళ్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కేంద్రం రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే కుతంత్రాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. కేంద్రం ఆంక్షలు తెలంగాణకు గుదిబండగా మారాయన్నారు. మీటర్ల విషయంలో రైతులపై భారం వేసే ప్రసక్తిలేదని తేల్చిచెప్పారు. గురువారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పబ్లిక్ గార్డెన్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘ పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుంచి అమలుకానున్నాయి. భవిష్యత్ తరాలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసంతో ఎదిగేందుకు ప్రతి గ్రామంలో ‘తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం’ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఈ రోజు నుంచే ఎంపిక చేసిన కొన్ని గ్రామాలలో ఈ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ బస్తీలలో నివసించే పేదల సమీపంలోకి వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం 350 బస్తీ దవాఖానాలను మంజూరు చేసింది. వీటిలో 256 దవాఖానాలు ఇప్పటికే సేవలందిస్తున్నాయి ” అని అన్నారు. మరి, కేసీఆర్ కేంద్రంపై చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Husband: బైక్ కే బోర్డు తగిలించుకోని తిరుగుతున్న భార్య బాధితుడు! వీడియో వైరల్..