తెలంగాణలోప్రముఖ జర్నలిస్టు, యాక్టివిస్ట్ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. అధికార పార్టీపై ఎప్పటికప్పుడు తనదైన విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 13 వేలకు పైగా ఓట్లు సాధించారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల ఆయన ఓ సొంత యూట్యూబ్ చానల్ ద్వారా.. రోజూ దినపత్రికల్లో వచ్చిన వార్తల విశ్లేషణలు అందిస్తున్నారు.
ప్రస్తుతం ఆయన గురించి ఓ వార్త సోషల్ మీడియాలో గుప్పుమంటుంది. తీన్మార్ మల్లన్న 1.50 కోట్లతో ఖరీదైన వోల్వో ఎక్స్‌సి 90 కారు కొనుగోలు చేసినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించే తీన్మార్ మల్లన్న ఖరీదైన కారు కొనుగోలు చేసి అందులో తిరుగుతున్నాడని చర్చలు నడుస్తున్నాయి. మరోవైపు ఇవన్నీ కేవలం ఆయనపై ప్రత్యర్థులు పుట్టిస్తున్న పుకార్లు మాత్రమే అని తీన్మార్ మల్లన్న అనుచరులు అంటున్నారు.
ఆ మద్య జ్యోతిష్కుడు లక్ష్మికాంత శర్మ తీన్నార్ మల్లన్న రూ.30 లక్షలు డిమాండ్ చేశాడని, అలాగే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేయడంతో మొదటగా మల్లన్నపై కేసు నమోదు చేశారు. ఒక కేసు నుంచి బయటకు రాగానే తీన్నార్ మల్లన్నపై మరోకేసు పెడుతూ వచ్చారు. మొత్తానికి ఈ కేసులతో రెండు నెలలకు పైగా జైల్లో గడిపారు తీన్మార్ మల్లన్న.
ఇదీ చదవండి: విద్యార్థులకు ఆర్టీసీ షాక్.. భారీగా పెరిగిన బస్ పాస్ ఛార్జీలు!
తెలంగాణ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిన తర్వాత.. ప్రభుత్వ యంత్రాంగం అవలంబిస్తున్న విధానాలపైన, మంత్రులు, ఉన్నతాధికారుల వేధింపులపైనా, బాధితుల తరపున సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో గళమెత్తిన తీన్మార్ మల్లన్న అనూహ్య నిర్ణయాలు తీవ్ర చర్చనియాంశమవుతున్నాయి. ఒక సాధాణ యూట్యూబ్ ఛానల్ నిర్వహించే తీన్మార్ మల్లన్న అంత ఖరీదైన వాహనం ఎలా కొనుగోలు చేశారు.. ఇది ఎంత వరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయం పై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి.