తెలంగాణలోప్రముఖ జర్నలిస్టు, యాక్టివిస్ట్ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. అధికార పార్టీపై ఎప్పటికప్పుడు తనదైన విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 13 వేలకు పైగా ఓట్లు సాధించారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల ఆయన ఓ సొంత యూట్యూబ్ చానల్ ద్వారా.. రోజూ దినపత్రికల్లో వచ్చిన వార్తల విశ్లేషణలు అందిస్తున్నారు. […]