ప్రభుత్వ పౌరసరఫరాల శాఖ నుంచి వచ్చే బియ్యం ఇతర వస్తువులు పేదలకు చేరడంలో కీలక పాత్ర పోషించేది రేషన్ దుకాణాలు. ఈ మధ్య కాలంలో వీటి పరిస్థితి ప్రశ్నర్థకంగా మారింది. కనీసం నిర్వహణ ఖర్చులకు రాకా రేషన్ డీలర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఈ దుకాణాలను లాభసాటి కేంద్రాలుగా తీర్చిదిద్దిడానికి కేంద్ర, రాష్ట ప్రభుత్వాల పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా మినీ గ్యాస్ సిలిండర్లు పంపిణీ, ఇంటర్‌నెట్ కేఫ్, సిటిజన్ చార్జ్ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు. తద్వారా డీలర్లకు కొంత కమీషన్ ఇచ్చి ఆర్థికంగా పరిపుష్టం చేయడంతోపాటు.. పేదలకు కొంత వరకు ఉపశమనం కలిగించనున్నారు.
రేషన్ షాపుల్లో బియ్యం, పంచదార, కిరోసిన్, గోధుమలు, ఇతర సరుకులతో పాటు మినీ గ్యాస్ సిలిండర్లు కూడా అందుబాటులో ఉండనున్నాయి. పైలెట్ ప్రాజెక్ట్ లో భాగంగా తెలంగాణాలోని నారాయణపేట జిల్లాలో తీసుకరావాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నారాయణ పేట జిల్లాలోని 11 మండలాల్లో 247 రేషన్ దుకాణాల్లో ప్రస్తుతం బియ్యం మాత్రమే సరఫరా అవుతోంది. తద్వారా రేషన్ డీలర్లకు చాలిచాలనంత కమీషన్ మాత్రమే వస్తోంది. ఈ నేపథ్యంలో 50 కిలోల బియ్యంలో మూడు నుంచి నాలుగు కిలోల తరుగు రావడంతో వచ్చిన కమీషన్ తరుగుకు సరిపోతుందని, నెల మొత్తం కష్టపడితే ఖాళీ సంచులు మాత్రమే మిగులుతున్నాయని, దీనికి తోడు కొందరు గ్రామాల్లో తిరిగి లబ్ధిదారుల నుంచి రేషన్ బియ్యం సేకరిస్తుంటే.. తాము నిందపడాల్సి వస్తుందని కొద్ది రోజులుగా డీలర్లు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో వీటిని బలోపేతం చేయడానికి చర్యలు చేపడుతున్నారు.
ఇదీ చదవండి: బండి సంజయ్ కు కేటీఆర్ లీగల్ నోటీసులు!ఇకపై రేషన దుకాణాల్లో లబ్ధిదారులతో పాటు ఆధార్ కార్డు ఉన్న వారికి 5 కిలోల గ్యాస్ సిలిండర్లును సరఫరా చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతీనెలా మినీ సిలిండర్లను సరఫరా చేయాలని నిర్ణయించారు. మొదటిసారి తీసుకుంటున్నావారికి ఒక్కోలిలిండర్ పై రూ.940 కి, తర్వాత నెల నుంచి రూ. 620 కే అందిస్తామని అధికారులు తెలిపారు. దీనితో రేషన్ డీలర్లు ఆర్థికంగా లాభాల బాట పడతారని ఆశిస్తున్నారు. అంతేకాక రేషన్ దుకాణాల్లో ఇంటర్‌నెట్ కేఫ్‌లు, పౌరసేవా పత్రం ద్వారా 14 రకాల సేవలను అందుబాటులోకి తేనున్నారు. తద్వారా కొంత కమీషన్ రూపంలో డీలర్లకు ఇవ్వనున్నారు. ఇదిలా ఉండగా రేషన్ దుకాణాలకు పీఎం వాణి కేంద్రాలుగా నామకరణం చేయనున్నట్లు సమాచారం. మరి.. రేషన్ దుకాణల మనుగడ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న ఈనిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.