నిరుద్యోగులకు శుభవార్త. ఇప్పటికే గ్రూప్స్ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న ఉద్యోగార్థులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. టీచర్ ఉద్యోగాల అర్హత కోసం నిర్వహించే టెట్ నోటిఫికేషన్ ను తెలంగాణ విద్యాశాఖ విడుదలచేసంది.
బీఎడ్, డీఎడ్ పూర్తి చేసి ఉపాధ్యాయ ఉద్యోగాలకోసం ఎదురుచూస్తోన్న ఉద్యోగార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కోసం ఎదురుచూస్తోన్న లక్షలాది అభ్యర్థులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. టెట్ క్వాలిఫై కాని వారికి, క్వాలిఫై అయిన వారు మార్కులు పెంచుకోవడం కోసం ఇదొక సువర్ణావకాశమనే చెప్పాలి. తాజాగా ఈ రోజు (మంగళవారం) టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నోటిఫికేషన్ విడుదల చేసింది తెలంగాణ గవర్నమెంట్. పరీక్ష తేదీ, ఫలితాల విడుదల తేదీలను, ఎలిజిబిలిటీ వివరాలను నోటిఫికేషన్ లో పొందుపర్చింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
ప్రభుత్వ ఉపాధ్యాయులుగా స్థిరపడాలని కలలుకనే వారికి గొప్ప అవకాశం. టీచర్ ఉద్యోగాల నియామకాలకు అర్హత సాధించాలంటే టెట్ క్వాలిఫై అవ్వడం తప్పనిసరి. ఈ క్రమంలో బీఈడీ, డీఈడీ విద్య పూర్తి చేసుకున్న ఉద్యోగార్థుల కోసం టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఆగస్టు 2వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. సెప్టెంబర్ 15న ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు టెట్ పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్షలు అధికారులు నిర్వహించనున్నారు. టెట్ ఫలితాలను సెప్టెంబర్ 27న విడుదల చేయనున్నట్లు తెలిపారు.
పేపర్-1 పరీక్షకు డీఈడీ, బీఈడీ అభ్యర్థులు ఇద్దరూ రాసుకునే అవకాశం కల్పించారు. బీఈడీ అర్హత కలిగిన అభ్యర్థులు పేపర్-2తోపాటు పేపర్-1 పరీక్ష కూడా అనుమతిచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈసారి జరిగే టెట్ పరీక్షకు దాదాపు రెండు లక్షల మంది అభ్యర్థులు పోటీపడనున్నారు. గతంలో టెట్‌కు 7 సంవత్సరాల వ్యాలిడిటీ ఉండగా, రెండేండ్ల క్రితం టెట్ వ్యాలిడిటీని జీవితకాలం పొడిగించారు. కాగా తాజా టెట్ నోపిఫికేషన్ తో టెట్ క్వాలిఫై కానివారికి, ఇటీవల బీఈడీ, డీఈడీ విద్య పూర్తి చేసుకున్న విద్యార్తులకు గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. ఇక పూర్తి వివరాల కోసం టీఎస్ టెట్ అధికారక వెబ్ సైట్ ను సంప్రదించండి.
ముఖ్యమైన సమాచారం:
దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 2
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 16
రాతపరీక్ష: సెప్టెంబర్ 15
పరీక్ష ఫీజు: రూ.400
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
వెబ్‌సైట్: https://tstet.cgg.gov.in