ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ ఫ్యాన్సీ నెంబర్ల కోసం నిర్వహించే ఆన్ లైన్ వేలంలో ఆ నంబర్లను దక్కించుకోవడం కోసం ఎంత చెల్లించడానికైనా వెనకాడరు. ఈ క్రమంలో ఖైరతాబాద్ ఆర్టీఏలో ఫ్యాన్సీ నెంబర్ కు రికార్డ్ ధర పలికింది.
ఫ్యాన్సీ, లక్కీ నంబర్ల కోసం బడా బాబులు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఫ్యాన్సీ నెంబర్లను దక్కించుకోవడం కోసం ఎంత ఖర్చుకైనా వెనకాడరు. ఫ్యాన్సీ నెంబర్లపై ఉన్న ఈ క్రేజే ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ కు కాసుల వర్షం కురిపిస్తోంది. వ్యక్తిగత నమ్మకాలు, సంఖ్యాబలం వంటి ఇతర కారణాలతో ఎక్కువ మంది తమ వాహనాలకు ఫ్యాన్సీ నెంబర్లను ఏర్పాటు చేసుకోవడానికి లక్షల్లో చెల్లించడానికి కూడా వెనకాడరు. ఈ క్రమంలో ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ లో ఫ్యాన్సీ నెంబర్ల కోసం జరిగిన వేలంలో ఓ ఫ్యాన్సీ నెంబర్ కు అత్యధిక ధర పలికింది. మునుపెన్నడు లేనివిధంగా సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇంతకీ ఆ ఫ్యాన్సీ నెంబర్ ను దక్కించుకున్నది ఎవరంటే?
రవాణా శాఖ రిజిస్ట్రేషన్ నంబర్ల కోసం కొత్త సిరీస్ ప్రారంభించిన సమయంలో ఫ్యాన్సీ నెంబర్ల కోసం ఆన్ లైన్ లో వేలం నిర్వహిస్తుంటుంది. కాగా ప్రతి కొత్త సిరీస్ లో 9,999 రిజిస్ట్రేషన్ నెంబర్లు ఉంటాయి. తాజాగా ఖైరతాబాద్ ఆర్టీఏలో రిజిస్ట్రేషన్ నంబర్‌ల కొత్త సిరీస్ GDకి సంబంధించి ఫ్యాన్సీ నెంబర్ల కోసం ఆన్ లైన్ లో వేలం నిర్వహించారు. ఈ వేలంలో 9999 అనే ఫ్యాన్సీ నెంబర్ అత్యధికంగా రూ. 21,60,000 ధర పలికింది. అత్యధిక బిడ్డర్‌లో ప్రైమ్ సోర్స్ గ్లోబల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్.. TS 09 GD 9999 నంబర్‌కు రూ.21.6 లక్షలు చెల్లించుకుంది. ఫ్యాన్సీ నెంబర్ల కోసం ఎక్కువగా సెలబ్రిటీస్, బిజినెస్ మేన్లు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు ఇష్టపడుతుంటారు.