మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు ఇంట విషాదం నెలకొంది. పీవీ నరసింహారావు పెద్దల్లుడు నచ్చరాజు వెంకటకిషన్‌రావు(83) హిమాయత్‌నగర్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన స్వస్థలం సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ళ గ్రామం. పీవీ పెద్దకుమార్తె శారదాదేవి ఆయన భార్య. ఆయనకు ముగ్గురు కుమారులు.
ఇది చదవండి: వైద్యం పేరుతో RMP డాక్టర్ దారుణం! సొంత భార్యనే!
పెద్ద కుమారుడు ఎన్వీ సుభాష్ ప్రస్తుతం బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. రెండో కుమారుడు డాక్టర్ కిరణ్ వైద్యరంగంలో స్థిరపడ్డారు. మూడో కుమారుడు శ్రవణ్‌కుమార్ పేరును ఇటీవలే సుప్రీంకోర్టు కొలీజియం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా సిఫార్సు చేసింది. కాంగ్రెస్ రాజకీయాల్లో పీవీ వెన్నంటే ఉండేవారు. ఆయన అంత్యక్రియలు బుధవారం గుగ్గిళ్ళలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంతాపం ప్రకటించారు.