ఃనేటికి మారుమూల పల్లెల్లో పేదరికం ఇంకా బుసలు కొడుతూనే ఉంది. రెక్కాడితే డొక్కాడని కుటుంబాలు, ఆకలి కేకలతో నలిగిపోతున్న అమాయకపు జీవితాలు, ఇలా చెప్పుకుంటూ నేటికి ఎన్నో కుటుంబాలు అభివృద్ధి అనే పదానికి ఎంతో దూరంలో ఉన్నాయి. నేటి తరం రాజకీయ నాయకుల మాటలు కోటలు దాటుతున్నా.. అభివృద్ధి మాత్రం నలుసంతైన కనిపించదు. పేద ప్రజల ఓట్లతో నాయకులు ఎమ్మెల్యేలు, మంత్రులుగా మారి ప్రజాధనంతో అద్దాల మేడలో నివాసముంటుంటే.. బతుకు పోరాటంలో గెలవలేక ఎన్నో పేద కుటుంబాలు మాత్రం ఇప్పటికీ ఉండటానికి గూడు లేక జీవితాన్ని ఈడ్చుకొస్తున్నారనటానికి ఈ మహిళ కథే ఉదాహరణ.
అది మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం తిరుమలగిరి గ్రామం. గుమ్మడి బాలయ్య, సుజాత భార్యాభర్తలు. వీరికి భాను(10), విన్నీ(7) అనే కుమార్తెలు కూడా ఉన్నారు. కొన్నేళ్ల కిందట సుజాత భర్త బాలయ్య మరణించాడు. దీంతో సుజాత జీవితం రోడ్డున పడింది. రెక్కాడితే డొక్కాడని కుటుంబాలు కావటంతో తినటానికి తిండి, ఉండటానికి గూడు లేక ఆ మహిళ ఎన్నో అవస్థలు పడింది. పేద కుటుంబం కావటంతో పొట్టచేతపట్టుకుని పిల్లలతో పాటు ఉండటానికి గూడు లేక గ్రామం పంచాయతీకి కమిటీ హాలులో సుజాత కొన్నాళ్లు జీవనం కొనసాగించింది.
దీంతో కొన్ని రోజులకే గ్రామంలోని పెద్దలు పంచాయతీకి చెందిన సామగ్రి పెట్టాలని సుజాతను అందులోంచి వెళ్లగొట్టారు. ఏం చేయాలే తెలియని సుజాత కొన్నాళ్ల నుంచి తన ఇంటి స్థలంలో ప్రభుత్వం నిర్మించిన బాత్ రూంలో పిల్లలతో పాటే నివాసం ఉంటోంది. అందులోని వండుకోవటం, అందులోనే పడుకోవటంతో చేస్తూ సుజాత బాత్ రూంని ఇల్లుగా మార్చుకుని జీవనాన్ని కొనసాగిస్తూ ఉంది. ఇక ఇల్లు కావాలని స్థానిక లీడర్ల సుజాత చెప్పులరిగేలా తిరగిన హామీలిచ్చి వెనక్కి జరిగారు.
ఇక ఏం చేయలేక సుజాత పిల్లలతో పాటు దయనీయ స్థితిలో అదే బాత్ రూంలో బుతుకును ఈడ్చుకొస్తుంది. ఇక ప్రభుత్వం మాత్రం మనం కోరుకున్న బంగారు తెలంగాణలో అభివృద్ధి జరిగిందంటూ కోటలు దాటే మాటలతో కాలాన్ని వెల్లదీస్తున్నారు. నేటి కాలంలో కూడా పేద బతుకులు ఎన్నో ఉన్నాయటానికి సుజాత జీవితమే నిదర్శనంగా చెప్పవచ్చు. ఇక సుజాత దయనీయ స్థితిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.