నగరంలో వ్యభిచార దందా సాగిస్తూ పోలీసులకు పట్టుబడుతున్న ఘటనలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు ఎంత నిఘా పెడుతున్నా.. వ్యభిచార ముఠాలు మాత్రం తమదైన శైలిలో పని కానిస్తున్నాయి. చట్టాలకు భయపడేదే లేదంటూ.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వ్యభిచార దందాను కొనసాగిస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి అందమైన యువతలను రప్పించి చీకటి వ్యాపారాన్ని జోరుగా నిర్వహిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తోన్న ఓ ముఠా పోలీసులకు పట్టుబడింది. వీరిలో ఓ సినీ రచయిత కూడా ఉన్నారు. ఆ వివరాలు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబై, పశ్చిమ బెంగాల్‌కు చెందిన కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి నగరంలో వ్యభిచార దందా నిర్వహిస్తున్నారు. కేవలం వాట్సప్ ద్వారానే వీరిని సంప్రదించేలా ఏర్పాట్లు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. డీల్ కుదిరిన తర్వాత.. అమ్మాయి, అబ్బాయిని ఓయో రూమ్స్ఇ లేదా తర హోటల్స్‌కి పంపుతున్నట్లు వెల్లడించారు. అందుకోసం వీరు ఆర్థిక అవసరాల్లో ఉన్న అందమైన అమ్మాయిలను గుర్తించి వారికి అధిక డబ్బు ఇస్తామని చెప్పి ఈ వృత్తిలోకి దించుతున్నట్లు తెలిపారు. ఈ విషయం పోలీసుల కంట పడకూడదనే ఉద్దేశ్యంతో.. అంతా ఆన్‌లైన్‌లో కానిస్తున్నట్లు వెల్లడించారు. అందుకోసం వీరు ప్రత్యేకమైన కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
వీరి దగ్గర ఉన్న యువతులు వీరితో సంబంధం లేనట్లుగా హాస్టళ్లలో ఉంటారు. ఎవరైనా బుక్ చేసుకున్నాక వారి ఇష్టం మేరకు ఓయో రూమ్స్ లేదా హోటల్స్‌కు వెళ్తారు. అంతేకాదు.. వీరు స్కోక్కా. ఇన్, లోకాంటో, వివా స్ట్రీట్ తదితర వెబ్‌సైట్లలో అమ్మాయిల ఫొటోలను ఉంచి యువతను ఆకర్షిస్తున్నట్లు తెలిపారు. ఇది చాలా కాలంగా జరుగుతోన్నట్లు పోలీసులు వెల్లడించారు. పక్కా సమాచారం అందడంతో.. ఈ ముఠాపై కొన్ని రోజులుగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వారిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేయగా, వీరిలో బాలీవుడ్ సినీ రచయిత మోహిత్ గార్గ్ ఉన్నట్లు వెల్లడించారు. నిందితుల నుంచి 35 ఫోన్లు, ఐదు ల్యాప్ టాప్‌లు, రెండు ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, ఏటీఎం కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.