తల్లిదండ్రులకు..తమ కన్నబిడ్డలపై ఉండే ప్రేమ అనంతం. తమ బిడ్డల ఉన్నతకి రేయింబవళ్ల కష్టపడుతుంటారు. పిల్లలు నవ్వుతే వీరు సంతోష పడతారు. పిల్లలు బాధ పడితే వీరు బాధ పడతారు. అలా అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు ప్రేమ వ్యవహారం లేదా ఇతర కారణాలతో ఆత్మహత్య చేసుకుని చనిపోతే.. ఆ తల్లిదండ్రుల బాధ వర్ణాతీతం. కొందరు తల్లిదండ్రులు పిల్లల జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ బ్రతుకు సాగిస్తారు. మరి కొందరు తమ బిడ్డలకు గుడి కట్టి పూజలు నిర్వహిస్తుంటారు. అచ్చం అలానే ప్రేమ వ్యవహారంతో ఆత్మహత్య చేసుకున్న తమ కుమారుడికి కొవెల నిర్మించి.. ఏటా కల్యాణం చేస్తున్నాడు ఓ తండ్రి. ఈ ఘటన మహబూబాబాద్ లో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. మహబుబాబాద్ జిల్లా బయ్యారం మండలం సంతులాల్ పోడు తండాకు చెందిన బానోతు లాలు, సుక్కమ్మ దంపతుల కుమారుడు రాంకోటి. ప్రేమ వ్యవహారంలో మనస్తాపం చెంది..2003లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తల్లిదండ్రులు కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. అతడిని మరిచిపోలేని వారు.. కుమారుడి విగ్రహంతో తమ ఇంటి ఆవరణంలో ఓ గుడి నిర్మించారు. అందులో ఓ యువతి విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేశారు. ఏటా శ్రీరామ నవమి సందర్భంగా ఇరుగుపొరుగు వారిని ఆహ్వానించి తనయుడికి కల్యాణం నిర్వహిస్తున్నారు. కొడుకు మీద ప్రేమను చంపుకోలేక ఆ తల్లిదండ్రులు చేస్తున్న ఈ కార్యంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.