ఒకప్పుడు చిన్న పిల్లలు బాాగా ఏడిస్తే.. ఎత్తుకొని జోల పాట పాడుతూ వాళ్లను నిత్రపుచ్చేవారు. కానీ ఈ మద్య చిన్న పిల్లలు ఏడిస్తే.. సెల్ ఫోన్ చూపించడమో.. మ్యూజిక్ పెట్టి వారిని బుజ్జగించడం లాంటివి చేస్తున్నారు.
సాధారణంగా చిన్న పిల్లలు ఎవరైనా ఏడిస్తే లాలిపాట లేదా జోలపాట పాడతాం. కానీ ఇప్పటి తల్లులకు జోలపాటలు రావు. ఒకవేళ వచ్చినా అందరి మధ్య పాడాలంటే సిగ్గు. పిల్లలను ఆడించాలన్నా, వారిని లాలించాలన్నా చంటిపిల్లలకు కూడా స్మాట్ ఫోన్ లే ఇస్తున్నారు. వాటిని చూసి ఆడడమే వారిపని. ఫోన్ పక్కన పెడితే ఏడుపులే.. ఇప్పటి జనరేషన్ అలా తయారయ్యారు.కానీ ఓ కాలేజీ లెక్చరర్ అమ్మలాలి పాట పాడి అందరిని మెప్పించాడు. అది ఎలాగో వివరాలలోకి వెళితే..
కరీంనగర్ డైట్ కాలేజీలో ట్రైనింగ్ తీసుకుంటున్న ఓ టీచర్ కు మూడు నెలల చిన్న పాప ఉంది. ఆ పాపతో కాలేజీకి వచ్చి క్లాస్ వింటుంటే పాపను ఆడించుకుంటూ ఓ లెక్చరర్ పాడిన జోలపాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వరంగల్ నుండి డిప్యుటేషన్ మీద పాఠాలు బోధించుటకు వచ్చిన లెక్చరర్ పేరు లక్ష్మినారాయణ చారి. ఈయన సంగీతం మాస్టారు కూడా. ఏడుస్తున్న పాపను ఓదారుస్తూ ఈయన పాడిన పాటను తోటి లెక్చరర్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారట.
ఇప్పుడు ఆ జోలపాట సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది.సార్ పాట విన్నవారందరు ఫిదా అయ్యారు. ఈ రోజుల్లో అమ్మలకు కూడా రాని జోలపాట ఒక మగ వ్యక్తి పాడటం గమనించదగ్గ విషయం కదా! జోలపాట విన్న ప్రతి ఒక్కరు సార్ ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సార్ జోలపాటపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.