గత కొంత కాలంగా తెలంగాణలో అధికార పార్టీ, ప్రతిపక్ష నేతల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కొన్ని సార్లు నేతలు వ్యక్తిగత దూషణలకు కూడా తెగబడుతున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలతో అధికార పార్టీ దళితబంధు పథకాన్ని తీసుకు వచ్చింది. దీనిపై ఓ వైపు ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తుంటే.. అధికార పార్టీ మాత్రం తన పని తాను చేసుకుపోతుంది.
నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న దళిత బంధు సమావేశం ఏర్పాటు చేశారు. కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశానికి తాను హాజరవుతున్నట్టు భట్టి వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. మధిర నియోజకవర్గం చింతకాని మండలం లో కూడా దళిత బంధు అమలు చేస్తున్నారని దాంతో స్థానిక ఎమ్మెల్యే అయిన తనను ఆహ్వానించారని బట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
ఇక బట్టి కేసీఆర్ సమావేశానికి హాజరు అవ్వడం పై విమర్శలు వచ్చే అవకాశం ఉంది. గతంలో కేసీఆర్ అఖిల పక్ష సమావేశానికి హాజరైన పలువురు కాంగ్రెస్ నేతలపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. . ఈ సమావేశానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా హాజరయ్యారు. ఈ సమావేశానికి ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు చెందిన మంత్రులు హాజరయ్యారు.