ఈమధ్యకాలంలో తరచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. షార్ట్ సర్క్యూట్ వంటి ఇతర కారణాలతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు సజీవ దహనం అయ్యారు. తాజాగా జగిత్యాల జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మంటలు భారీగా ఎగసి పడ్డాయి
ఈమధ్యకాలంలో తరచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. షార్ట్ సర్క్యూట్ వంటి ఇతర కారణాలతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు సజీవ దహనం అయ్యారు. మరికొందరు కాలిన గాయాలతో జీవితాన్ని ఎంతో నరకంగా అనుభవిస్తున్నారు. ఇటీవలే సికింద్రాబాద్ లోని స్వప్న కాంప్లెక్స్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు యువత ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసింది. మరికొన్ని సందర్భాల్లో అందరి అప్రమత్తంతో పెను ప్రమాదాల నుంచి బయట పడుతుంటారు. తాజాగా జగిత్యాల జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మంటలు భారీగా ఎగసి పడ్డాయి. ఇక స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
జగిత్యాల జిల్లాలోని చిననకెనాల్ సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది. ధర్మశాల స్థలంలోని చెత్తకుప్పలకు రాత్రి నిప్పంటుకుంది. దీంతో క్షణాల వ్యవధిలో ఈ మంటలు భారీ ఎత్తున ఎగసిపడ్డాయి. అయితే ఈ ఘటన జరిగిన స్థలానికి కొద్ది దూరంలోనే రెండు ప్రైవేటు బస్సులు నిలిపి ఉన్నాయి. దీంతో ఆ బస్సుల నిర్వాహకులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బందికి బస్సుల నిర్వాహకులు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఎగసిపడుతున్న మంటలను అదుపు చేశారు. చాలా సమయం పాటు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది… చివరకు మంటలను అదుపులోకి తెచ్చారు.
దీంతో స్థానికులతో సహా అందరు ఊపిరి పీల్చుకున్నారు. అయితే మంటలు ఎగసిపడిన సమయంలో ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ కమ్ముకుంది. ఏం జరుగుతుందో చాలా సమయం పాటు తమకు అర్ధం కాలేదని స్థానికులు తెలిపారు. సమీపంలో ఉండే నివాసల వైపు ఆ నిప్పు రవ్వలు వెళ్తాయని అందరు భయందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది సమయానికి ఘటన స్థలానికి చేరుకుని పెను ప్రమాదాన్ని తప్పించారు. మరికొన్ని సందర్భాల్లో చిన్న చిన్న ప్రమాదాలే పెద్ద ఘోరాలకు దారి తీసిన ఘటనలు అనేకం జరిగాయి. మరి.. ఇలా తరచూ అగ్నిప్రమాదాలు జరగటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.