సాధారణంగా ఎంత భూమి ఉన్న ఇంకా కావాలనే ఆశ చాలామందిలో ఉంటుంది. దాని కొందరు సమీపంలో ఉండే అడవులను సైతం నరికేసి భూములుగా మార్చుకుంటున్నారు. కానీ కొందరు మాత్రమే తమకున్న భూమిని సమాజ హితం కోసం ఉపయోగిస్తారు. ఆ కోవకి చెందిన వ్యక్తే దుశ్చర్ల సత్యనారాయణ. ఆయన జీవితం ఎందరికో ఆదర్శం. తనకు వారసత్వంగా వచ్చిన 70 ఎకరాల వ్యవసాయ భూమిని అడవిగా మార్చి జీవవైవిధ్యానికి పర్యావరణ పరిరక్షణకు ప్రాణం పోస్తున్నాడు. కాసుల కోసం కొట్టుకునే వారు ఉన్న ఈ కాలంలో ఇలాంటి వ్యక్తులు అరుదుగా కనిపిస్తారు.
సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవాపురానికి చెందిన దుశ్చర్ల సత్యనారాయణ అనే రైతుకు చిన్న తనం నుంచి పర్యావరణంపై ఆసక్తి ఎక్కువ. తనకు వారసత్వంగా 70 ఎకరాల భూమి వచ్చింది. అయితే తన మనసులో అడవిని పెంచాలనే విత్తనంగా పుట్టిన ఆలోచన.. నేడు ఓ వటవృక్షంగా మారింది. మొదట్లో అందరి రైతుల లాగానే16 ఎకరాలు జొన్న పంట సద్ద పంట వేసిన పంటను పక్షులు తినకుండా కాపలా ఉండేందుకు కూలీ వాళ్లను పెట్టాడు. కానీ ఒకరోజు పక్షులు వచ్చి ఆ పంట గింజలను తింటుంటే అతని మనసు మారిపోయింది. పక్షులకు పొట్ట నింపాలి అనుకున్నాడు. అప్పటి నుంచి ఆ పంట మొత్తం పక్షులకు వదిలేశాడు. ఇదే క్రమంలో తన వ్యవసాయ భూమిలో కూడా పంటలను వదిలేసి చెట్లను నాటడం మొదలు పెట్టాడు.కాల చక్రం తిరుగుతున్న నేపథ్యంలోనే వేలాది చెట్లు పెరిగాయి. ఒకటి కాదు రెండు కాదు 70 ఎకరాల్లో ఓ చిన్న అడవి ఏర్పడింది.ఈ అడవిలో విరిగిన కొమ్మలు సైతం అక్కడే భూమిలో కలసిపోవాల్సిందే కానీ సత్యనారాయణ ముట్టడు. మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలనే అనుకునే ఈ రోజుల్లో మనిషి స్వార్థం వీడి భూమి పై ఉండే జీవుపై ప్రేమ పెంపోదాలి అనటానికి సత్యనారాయణం ఆదర్శం. ఈ నేటికాలంలో ఇంత గొప్ప ఆలోచన రావడం ఎవరికి సాధ్యం కాదు. కానీ దుశ్చర్ల సత్యనారాయణ చేస్తున్న ఈ పనులు మనమంతా చేతులెత్తి అభినందించాల్సిందే. మరి..ఇలాంటి గొప్ప వ్యక్తి పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.