రాష్ట్రంలో వీధి కుక్కల స్వైర విహారం కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో ఐదేళ్ల చిన్నారిపై వీధికుక్కలు దాడి చేసి చంపేసిన విషయం విదితమే. ఈ ఘటన జరిగిన నాటి నుంచి గ్రామ సింహాల దాడులు మరింత పెరిగాయి. వారం వ్యవధిలోనే రాష్రావ్యాప్తంగా కుక్కకాటు కేసులు వందకుపైగా నమోదయ్యాయి. అయితే ఇన్నాళ్లు సాధారణ ప్రజలపై ప్రతాపం చూపించిన గ్రామ సింహాలు ఇప్పుడు రాజకీయ నాయకులపై దాడులు చేస్తున్నాయి.
కుక్కలు.. కుక్కలు.. తెలంగాణ ప్రజానీకం దృష్టంగా వీటిపైనే ఉంది. అందుకు కారణం.. రాష్ట్రంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తుండటమే. హైదరాబాద్ లోని అంబర్‌పేటలో ఐదేళ్ల చిన్నారిపై వీధికుక్కలు దాడి చేసి చంపేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత సైతం అనేక ప్రాంతాల్లో వీధికుక్కల దాడుల్లో పలువురు చిన్నారులు తీవ్ర గాయాలపాలయ్యారు. తాజాగా, ఓ పిచ్చికుక్క రాజకీయ నాయకుడిని ముచ్చెమటలు పట్టించింది. నడుచుకుంటున్న వెళ్తున్న అతనిపై నిర్ధాక్షిణంగా దాడి చేయడమే కాకుండా తీవ్రంగా గాయపరిచింది.
నిర్మల్ జిల్లా బాసర మండలం బిద్రెల్లి గ్రామానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మండల ఎంపీపీ సునీత భర్త విశ్వనాథ్ అతని స్నేహితులతో కలిసి నడుచుకుంటుంటూ వెళ్తున్నాడు. ఆ సమయంలో వెనక నుండి వచ్చిన కుక్క ఒక్కసారిగా అతడిపై దాడికి దిగింది. దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినా అది అతన్ని గాయపరచకుండా వదల్లేదు. తీవ్రంగా గాయపరిచింది. వెంటనే పక్కనున్న వ్యక్తి అప్రమత్తమవ్వడంతో అతను ఊపిరి పీల్చుకున్నాడు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు అంబర్‌పేట బాలుడి ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. వీధి కుక్కల దాడులు, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై గైడ్ లైన్స్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల పరిధిలో చర్యలకు ఆదేశించింది. వీధి కుక్కల సంఖ్య పెరగకుండా నియంత్రించాలని… కుక్కలకు 100 శాతం స్టెరిలైజేషన్ చేయాలని ఆదేశించింది. మాంసం దుకాణాలు, ఫంక్షన్ హాళ్ల వారు మాంసాహారాన్ని ఎక్కడ పడితే అక్కడ రోడ్లపై పడేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. వీధి కుక్కలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి.. వాటిపై పిల్లలకు, పెద్దలకు అవగాహన కల్పించాలని పేర్కొంది. ఈ మేరకు కరపత్రాలను పంపిణీ చేయాలని.. జీహెచ్ఎంసీ, సంబంధిత శాఖలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.