సాధారణంగా కొడుకు పుట్టాలని అందరు కోరుకుంటారు. కారణం వృద్ధాప్యంలో బాగోగులు చూసుకుంటూ. మరణిస్తే అంతిమ సంస్కారాలు చేస్తారని. అయితే నేటికాలంలో కొందరు పుత్రులు తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కానీ కొందరు అమ్మాయిలు కొడుకులకు తీసిపోకుండా. తల్లిదండ్రుల పట్ల కుమారుడి పాత్ర పోషిస్తున్నారు. కొన్ని దృశ్యలు చూసినప్పుడు కొడుకుల కంటే కూతుర్లే మేలు అనే భావన కలుగుతుంది. తాజాగా ఓ కూతురు.. తన చేతుల మీదగా తండ్రికి అంతిమ సంస్కారాలు జరిపింది. ఆ దృశ్యం స్థానికులను కంట తడిపెట్టించింది.
వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం ఎల్.కె.పారం గ్రామానికి చెందిన వెంకటేశ్వరావు(71)కి సరళ, సరిత అనే ఇద్దరు కుమార్తెలు. వారిద్దరికి పెళ్లిళు చేసి.. ఆయన వృద్ధాప్య జీవితాన్ని గడుపుతున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటేశ్వరావు.. ఆదివారం మృతిచెందాడు. అయితే యాధృచ్చికం ఏమిటంటే ఆయన పుట్టిన రోజే సరిగ్గా మరణించారు. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి వెంకటేశ్వరరావుకు తలకొరివి పెట్టడానికి కొడుకు లేరు. వెంకటేశ్వరావుకు ఉన్నది ఇద్దరూ ఆడసంతానమే అయినప్పటికి వారు మగ బిడ్డలకు ఏమాత్రం తీసిపోమని చాటుకున్నారు. వెంకటేశ్వరరావు పండుగ నాడు చనిపోవడం బాధాకరమైన విషయం అయితే..కన్నకూతుర్లే తలకొరివి పెట్టి.. అంతిమ సంస్కారాలు నిర్వహించడం జరిగింది. ఆ దృశ్యాలను చూసిన స్థానికులు కంటతడిపెట్టుకున్నారు. మరి..ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలోతెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.