సినిమాల్లో చోరీ చేసిన సొత్తుతో దొంగలతు పారిపోతుంటే పోలీసులు వారిని ఛేజింగ్ చేసి మరీ పట్టుకుంటారు. ఆ సమయంలో వారిపై కాల్పులు కూడా జరుపుతుంటారు.. ఆ సీన్లు చూస్తుంటే భలే ఎంజాయ్ మెంట్ ఉంటుంది.. అప్పుడప్పుడు రియల్ లైఫ్ లో కూడా అలాంటి సన్నివేశాలు జరుగుతుంటాయి.
ఈ మద్య కొంతమంది కేటుగాళ్ళు ఈజీ మనీ కోసం ఎన్నో అక్రమాలకు పాల్పపడుతున్నారు. కొన్నిసార్లు దొంగలు చోరీ చేసి వాహనాల్లో తప్పించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు.. ఆ సమయంలో పోలీసులు ఛేజింగ్ చేసి వాళ్లను పట్టుకుంటారు.. కొన్నిసమయాలో ఇరు వర్గాలు కాల్పులు కూడా జరుపుకుంటారు. ఇలాంటి ఘటనే నిజామాబాద్ లో చోటు చేసుకుంది. దొంగల చోరీ చేసిన సొత్తుతో కారులో తప్పించుకునే ప్రయత్నం చేయగా వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
నిజామాబాద్ జిల్లా శివారు ప్రాంతంలో దొంగలపై పోలీసులు కాల్పులు జరిపారు. సినిమా రేంజ్ లో దొంగలను ఛేజింగ్ చేసే క్రమంలో వారిపై కాల్పులు జరిపారు. రాజస్థాన్ ముఠాను పట్టుకునేందుకు మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. రాజస్థాన్ కు చెందిన ముఠా కొంతకాలంగా జిల్లాలో ట్రాన్స్ ఫార్మర్ లోని కాపర్ వైర్లను దొంగిలిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం లభించింది. ఈ ముఠా రాజస్థాన్ నుంచి వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇందల్వాయి మండలం జాతీయ రహదారిపై పోలీసులను చూసిన దొంగలు పారిపోయే ప్రయత్నం చేశారు. దొంగలు ప్రయాణించే కారును ఛేజింగ్ చేశారు పోలీసులు.. ఈ క్రమంలోనే కాల్పులు జరిపారు.
రాజస్థాన్ ముఠాను పట్టుకునేందుకు పోలీలుసు అన్ని ప్రయత్నాలు చేశారు.. కానీ దొంగలు అక్కడ నుంచి తప్పించుకున్నారు. అయితే కాల్పుల్లో కారు టైరుకు బుల్లెట్ తగలడంతో దొంగలు కారును శివారులో వదిలివేసి పారిపోయారు. మొత్తానికి దొంగలను పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు జరిపిన కాల్పులతో స్థానికులు ఒక్కసారిగా ఆందోళన చెందారు.. కాల్పుల శబ్ధంతో భయాందోళనకు గురయ్యారు. దొంగలను పట్టుకునేందుకు బృందాలుగా ఏర్పడి గాలింపులు చేపట్టినట్టు పోలీస్ అధికారి తెలిపారు.