సీఎం కెసిఆర్ మంగళవారం శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ అనంతరం మాట్లాడుతూ.. ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్లీ విధుల్లోకి తీసుకుంటున్నట్టు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. అయితే, ఫీల్డ్ అసిస్టెంట్లు మరోసారి పొరపాటు చేయొద్దని హితవు పలికారు. కాగా, రెండేళ్ల కిందట తెలంగాణ ప్రభుత్వం వేల సంఖ్యలో ఉపాధి హామీ పథకంకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడం తెలిసిందే. బకాయిల చెల్లింపు, వేతనాల పెంపు, జీవో నెం.4779 రద్దు చేయాలన్న డిమాండ్లతో నాడు ఫీల్డ్ అసిస్టెంట్లు సమ్మె చేశారు. తదనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో వారిని తెలంగాణ ప్రభుత్వం తొలగించింది.
అప్పటినుంచి ఫీల్డ్ అసిస్టెంట్లు తమను విధుల్లోకి తీసుకోవాలంటూ వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు తమను విధుల్లోకి తీసుకోవాలంటూ వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. కొన్ని రోజుల కిందట కూడా తెలంగాణ అసెంబ్లీని ముట్టడించారు. ఈ నేపథ్యంలో, సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్లీ విధుల్లోకి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెర్ఫ్‌లో 4,500 మంది పని చేస్తున్నారు. సెర్ఫ్ సొసైటీ.. ప్రభుత్వ ఉద్యోగులు కాదు. అయినప్పటికీ మహిళా సంఘాలను చైతన్యం చేసేందుకు, ఆర్గనైజింగ్ కెపాసిటీ పెంచేందుకు విశేష కృషి చేస్తున్నారు. మంచి ఫలితాలు వస్తున్నాయి.
ఇది చదవండి: ఆఫీసుల్లో మొబైల్ వాడకంపై హైకోర్టు సంచలన తీర్పు!
సెర్ఫ్ ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తాం. ఫీల్డ్ అసిస్టెంట్స్ అని చెప్పి ఉపాధిహామీలో పని చేస్తారని అన్నారు. అయితే వారంతా ప్రభుత్వ ఉద్యోగులు కాదన్న విషయం తెలిసి కూడా.. ఓ భ్రమలో సమ్మెకు వెళ్లారు. సమ్మె వద్దని పంచాయతీరాజ్ శాఖ మంత్రి, సంబంధిత శాఖ అధికారులు చెప్పినా వినకుండా వెళ్లారు. తర్వాత వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పెద్ద మనసుతో వాళ్లను క్షమించాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారు. తెలంగాణ బిడ్డలు వాళ్లపై మాకేం కోపం లేదు. వారికి పెద్దన్నలా హెచ్చరిస్తున్నా.. ఇకపై పొరపాట్లు పునరావృతం చేయొద్దు. మానవతా దృక్పథంతో తీసుకుంటాం. మళ్లీ ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటాం అంటూ వార్నింగ్ ఇస్తూనే తిపి కబురు చెప్పారు సీఎం కేసీఆర్.