సీఎం కెసిఆర్ మంగళవారం శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ అనంతరం మాట్లాడుతూ.. ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్లీ విధుల్లోకి తీసుకుంటున్నట్టు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. అయితే, ఫీల్డ్ అసిస్టెంట్లు మరోసారి పొరపాటు చేయొద్దని హితవు పలికారు. కాగా, రెండేళ్ల కిందట తెలంగాణ ప్రభుత్వం వేల సంఖ్యలో ఉపాధి హామీ పథకంకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడం తెలిసిందే. బకాయిల చెల్లింపు, వేతనాల పెంపు, జీవో నెం.4779 రద్దు చేయాలన్న డిమాండ్లతో నాడు ఫీల్డ్ అసిస్టెంట్లు సమ్మె చేశారు. […]