బిగ్‌బాస్5 తెలుగులో అద్భుతమైన ఆటను ప్రదర్శించి విజేతగా నిలిచిన సన్నీ గురించి సోషల్ మీడియా పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బిగ్‌బాస్ 5 తెలుగు విన్నర్ సన్నీ, అలాగే ఎన్టీఆర్ హోస్ట్‌గా చేసిన మరో పెద్ద గేమ్ షో ఎవరు మీలో కోటీశ్వరుడులో మొదటిసారి కోటి రూపాయలు గెలిచిన రాజా రవీంద్రకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పెద్ద గేమ్ షోలలో విజేతలుగా నిలిచిన వీరిద్దరిది ఉమ్మడి ఖమ్మం జిల్లానే కావాడం విశేషం.
రాజా రవీంద్రది కొత్తగూడెం కాగా, సన్నీది ఖమ్మం. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా విడిపోయిన విషయం తెలిసిందే. భారీ ఆదరణ పొందిన రెండు గేమ్ షోల విన్నర్లు తమ జిల్లా వారే అని ఖమ్మం జిల్లా యువత సోషల్ మీడియాలో హంగామా చేస్తుంది. మరి ఈ ఇద్దరు విన్నర్లు ఒకే ఉమ్మడి జిల్లా వారు కావడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.